-జగనన్నకు చెబుదాం కార్యక్రమం అర్జీలను సకాలంలో నాణ్యతగా అర్జీ దారుల సంతృప్తి మేరకు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
-నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో గృహాల నిర్మాణాలు వేగవంతం చేయాలి
-జగనన్న కాలనీ లే అవుట్ లలో మౌలిక వసతులు ఏర్పాటు కావాలి
-రెవెన్యూ అంశాలు మ్యుటేషన్ లు, ట్రాన్సాక్షన్, కరెక్షన్ లు ఎప్పటికప్పుడు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాల స్టేజి కన్వర్షన్ ఉండేలా వేగవంతం చేయాలని, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో పరిష్కరించాలని, పర్యాటక శాఖకు చెందిన భూమి అలియనేషన్ త్వరితగతిన చేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, పర్యాటక శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖల అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో కలిసి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఇంఛార్జి జెసి శ్రీనివాస రావు తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టరేట్ నుండి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం గౌ. ముఖ్యమంత్రి ప్రారంభించిన నేపథ్యంలో మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, పంచాయితీ స్థాయి వరకు లాగ్ ఇన్ లు ఇవ్వడం జరిగిందని, పిఎంయు లు, ఆడిట్ టీమ్ లు ఏర్పాటు చేశామని, స్వయంగా తాను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ఫిర్యాదు దారుల అర్జీలను సకాలంలో నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. రెవెన్యూ అంశాలకు చెందిన అర్జీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మండలాల్లో ఏర్పాటైన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల లో ఎస్ హెచ్ ఓ లు, తాసిల్దార్లు, వ్యవసాయ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు తదితర అధికారులు ఉండడం వలన చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. రెగ్యులర్ గా ఈ అంశాన్ని సమీక్షిస్తున్నామని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై అందరూ అధికారులు జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించాలని తప్పనిసరిగా బియాండ్ ఎస్ ఎల్ ఎ కు వెల్లకుండ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేసేలా వివిధ స్టేజిలో ఉన్నవాటిని పూర్తి చేసే దిశగా వేగవంతం చేయాలని, స్టేజి వారీగా పురోగతి ఉండాలని ఆదేశించారు. పునాది పడిన ఇంటి నిర్మాణాలకు పొదుపు సంఘాల ద్వారా అదనపు రుణం లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీ లోని కేటగిరి3 లేఔట్ లలో తాగు నీటి కొళాయిలు ఏర్పాటు, విద్యుత్తు కనెక్షన్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్చిల నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని అన్నారు. పిఎంఈవై గ్రామీణ పై దృష్టి సారించి వేగవంతం చేసి పురోగతి చూయించాలని అన్నారు. నిబంధనల మేరకు నరేగా తో ఇళ్ళ నిర్మాణాలలో అనుసంధానం చేయాలని సూచించారు. వర్షాకాలంలోపు గృహ నిర్మాణాలు తప్పనిసరిగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సామూహిక గృహ ప్రవేశాలు తొందరలోనే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పురోగతి ఉండాలని సూచించారు.
జిల్లాలో చేపడుతున్న జగనన్న భూహక్కు – భూ రక్ష రీసర్వే లో రెండవ ఫేజ్ గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, వెక్టరైజేషన్ డి ఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలనీ సూచించారు. పెండింగ్ భూ హక్కు పత్రాల పంపిణీ అందిన వాటిని రెండు రోజుల్లో పంపిణీ చేయాలనీ, అలాగే మిగిలిన వాటిని త్వరితగతిన అందిన వాటిని అందినట్లుగా పూర్తి చేయాలని అన్నారు. ఫేజ్2 రీ సర్వే గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, ఆర్ ఓ ఆర్, స్టోన్ ప్లాంటేషన్ తదితర దశలు సిసిఎల్ఏ కార్యాలయం నుండి నిర్దేశించిన గడువుల లోపు పూర్తి చేసేలా ప్రణాళికా బద్ధంగా అధికారులు పని చేయాలనీ సూచించారు. అలాగే మ్యుటేషన్ లు, ట్రాన్సాక్షన్, కరెక్షన్ లు ఎప్పటికప్పుడు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారులు భూసేకరణకు చెందిన పరిహారం జిల్లాకు అందిన మొత్తాన్ని త్వరితగతిన సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేయాలనీ తెలిపారు.
పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అలియనేషన్ ప్రక్రియ వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి పూర్తి అయ్యేలా చర్యలు ఉండాలని అన్నారు.
వ్యవసాయశాఖను సమీక్షిస్తూ వై ఎస్ ఆర్ యంత్ర సేవా పథకం కింద కస్టమర్ హైరింగ్ సెంటర్ గ్రూపులకు మెషినరీ సబ్సిడీపై అందించి ఆర్బికే స్థాయిలో అందుబాటులో ఉంచి తక్కువ అద్దెతో వినియోగించడం కొరకు జిల్లాలో మంచిగా జరుగుతోందని ఇంకనూ అవసరమైన మెషినరీ ఈ నెల 25 లోపు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న పాల వెల్లువ కింద రిజిస్టర్ అయిన రైతులకు ప్రాధాన్యతతో చేయూత పథకం కింద పాడి పశువులు మంజూరు కొరకు చర్యలు తీసుకోవాలని గ్రౌండింగ్ పై సమీక్షించుకుని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మల్టీ పర్పస్ ఫెసిలిటీ గోడౌన్ లు మొదటి ఫేజ్ కింద మంజూరు అయిన వాటిని వేగవంతం చేసి పూర్తి చేయాలనీ, రెండవ ఫేజ్ కింద మంజూరు అయిన వాటిని నవంబర్23 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బాల్య వివాహాలు నివారణకు వివిధ స్థాయిలలో కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడీ వెంకటేశ్వర్లు, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ప్రాంతీయ సంచాలకులు రమణ ప్రసాద్, జిల్లా సర్వే అధికారి జయరాజ్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శంకర్ నారాయణ, జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News