Breaking News

గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శున్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 10వ డివిజన్ 48వ సచివాలయం పరిధిలోని పి&టి కాలనీ ప్రాంతాలలో నాయకులు,సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్  ముఖ్యమంత్రి అయ్యాక కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ,వలంటీర్ వ్యవస్థ లు ప్రవేశపెట్టి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది నేరుగా గడప వద్దకే అందిస్తున్నారని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు. ఈ 10వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్, ఎంపీ, ఎమ్మెల్యే టీడీపీ వారే నని కానీ వారు గెలిచిన తర్వాత ఇంతవరకు ప్రజలకు మొహం చూపించలేదని ఎద్దేవా చేశారు. కానీ వైసీపీ నాయకులు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బొప్పన బవకుమార్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,10వ డివిజన్ ఇంచార్జ్ హరీష్,వైస్సార్సీపీ నాయకులు వేములపల్లి మురళి,తుమ్మల వెంకటరత్నం,శివ నాగేశ్వరావు,అచ్చుతరావు,కాకాని బాబు,దూడల రాజేష్,నిడదవోలు ఉదయ్,పరవతనేని బాబీ,వంశి, తమ్మారెడ్డి ప్రకాష్ మరియు డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *