Breaking News

నేటి సాయంత్రం త్రాగునీటి సరఫరాలో అంతరాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో త్రాగునీటి సరఫరాపై ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు, లీకులు మరమ్మతులు చేసి మెరుగైన సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ఆదేశాల మేరకు నెహ్రునగర్ నుండి లక్ష్మీపురం సరఫరా జరిగే 800 డయా పైప్ లైన్ కు సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద ఏర్పడిన లీకు మరమత్తులను బుధవారం చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ ఎస్.ఈ. పివికే.భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఈ. మాట్లాడుతూ నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్.ఎల్.ఆర్.కు త్రాగునీరు సరఫరా ప్రస్తుతం 800 ఎం.ఎం.డయా పైప్ లైన్ పై సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద లీకు ఏర్పడి త్రాగునీరు వృధాగా పోతుందని, సదరు లీకును బుధవారం ఉదయం సరఫరా అనంతరం మరమత్తు చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. లీకు మరమత్తు పనుల వలన నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం ఉదయం సరఫరా యధావిదిగా జరుగుతుందని, సాయంత్రం సరఫరా జరిగే ప్రాంతాల్లో అంతరాయం కల్గుతుందని తెలిపారు. గురువారం ఉదయం నుండి సరఫరా యధావిధిగా జరుగుతుందన్నారు. బుధవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గంలోని లక్ష్మిపురం, స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల, ఏ.టి అగ్రహారం, ఎయంసి, హౌసింగ్ బోర్డు, కోర్టు కాంపౌండ్, కెవిపి కాలని, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగర్ తదితర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడునని, ప్రజలు గుంటూరు నగరపాలక సంస్ధకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకొనవలసినదిగా కోరుతున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *