Breaking News

పేదరికం జయించెందుకు విద్యే ఆయుధం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు భద్రత భరోసా భాగ్యాన్ని అందిస్తూ రాజకీయ విలువలను కాపాడుతూ నైతికత తో కూడిన పరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట సంక్షేమ పెన్నిధిగా వారి అవసరాలు నెరవేరుస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, బీసీ సంక్షేమం, సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం హోంమంత్రి తానేటి వనిత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా లతో కలసి, స్థానిక నాయకులు రాజీవ్ కృష్ణ, ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కొవ్వూరు పట్టణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన రాష్ట్రస్థాయి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు విద్యార్థినీ విద్యార్థులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పేదరికం జయించెందుకు విద్యే ఆయుధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతని ఇచ్చారని పేర్కొన్నారు. గత కాలంలోని పరిపాలన సమయంలో అప్పటి పాలకులు విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. నేడు ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పేదరికాన్ని నిర్ములించి అభివృద్ధి దిశగా వెళ్లేందుకు విద్యా ద్వారానే సాధ్యమని నమ్మిన ఏకైక వ్యక్తి జగనన్న అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో అత్యంత గౌరవ ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశలోనే మన మహిళా సోదరి తానేటి వనితకు హోం మంత్రి పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని అందించారన్నారు. రాష్ట్రం లో విద్యకు ముఖ్యమంత్రి అత్యంత ప్రధాన్యతను ఇస్తు విద్యాదీవెన అందిస్తుంటే ప్రజలు జగనన్నకు మద్దతుగా దీవేనలు అందిస్తున్నారని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన అనే ప్రతిష్టాత్మమైన కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని హోంమంత్రి తానేటువంటి పేర్కొన్నారు. తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగనన్నకు స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంగా హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో జగనన్న చేసిన మేలు సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీసు రెవెన్యూ వివిధ శాఖల అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారని హోం మంత్రి తానేటువంటి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *