Breaking News

ఈనెల 28న యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

-యుపిఎస్సి ప్రిలిమ్స్ 2023 పరీక్షలకు హాజరుకానున్న 6333 మంది అభ్యర్థులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28న ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు విధులు కేటాయించబడిన జిల్లాస్థాయి అధికారులతో, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, తసిల్డార్లతో తదితర సంబంధిత అధికారులతో కలిసి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ పరీక్షలకు జిల్లాలో 6333 మంది అభ్యర్థులు వ్రాయనున్నారని పరీక్షల నిర్వహణ ఉదయం 9.30 నుండి 11.30 వరకు మధ్యాహ్నం 2.30 PM నుండి 4.30 PM వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులను మూడు సెంటర్లకు ఒక అధికారిని సహాయ సమన్వయకర్తలు గా 13 సెంటర్లకు 7 మందిని నియామకం చేయడమైనదని, 13 మంది ఎమ్మార్వోలు సిట్టింగ్ స్క్వాడ్ విధులతో ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల చీఫ్ సూపర్డెంట్లు పరీక్ష నిర్వహణకు ఇచ్చిన కేంద్ర మార్గదర్శకాల పై పూర్తి అవగాహన కలిగి ఉండి పరీక్ష కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సజావు గా ఉండేలా చూడాలని అన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు ఉండేలా చూడాలని తెలిపారు. విద్యుత్ శాఖ వారు పరీక్షా కేంద్రంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పోలీస్ శాఖ తగినంత మంది మహిళా సిబ్బంది, భద్రతా సిబ్బంది ఉండేల, వైద్య ఆరోగ్య శాఖ వారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రథమ చికిత్స మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్డిఓ కస్టోడియన్ గా వారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు.

పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే గేట్లు మూసి వేయబడతాయని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు. పరీక్ష కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సెల్ ఫోన్లు ఎవరికి కూడా అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కంటి లోపం కల విజువలీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని స్క్రైబ్ లను తగినంత మందిని ఏర్పాటు ఉండాలని సూచించారు. కేంద్ర యుపిఎస్సి నుండి ఒక అబ్జర్వర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న గారిని అబ్జర్వర్ గా నియామకం చేశారని వారు త్వరలోనే జిల్లాకు రానున్నారని సమీక్ష ఉంటుందని, ఈ లోపు సంబంధిత అధికారులు పరీక్షల నిర్వహణ సక్రమంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి చేపట్టాల్సిన చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ఏడి సర్వే జయరాజ్, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అగ్రికల్చర్ అధికారి ప్రసాదరావు, చీఫ్ సూపర్డెంట్లు, తాసిల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *