Breaking News

గ్రూప్‌-1, 2 ఉద్యోగార్ధులకు శుభవార్త

-గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
-అతి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్‌
-1000కిపైగా పోస్టుల భర్తీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గ్రీన్‌ సిగ్న్‌ ఇచ్చారు. ఈ ఉదయం ముఖ్యమంత్రికి అధికారులు ఈపోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *