Breaking News

సోలార్ వాహనాల వినియోగం పై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ కాలుష్య నివారణ కోసం సోలార్ వాహనాల వినియోగం పై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నెడ్ క్యాప్ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేసిన స్టాల్ ను కలెక్టర్ ప్రారంభించి, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, వాతావర కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం పై ప్రజల్లో అవగాహన కోసం మరిన్ని ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వాతావరణంలో కాలుష్యం పెరగడం వల్ల విపరీతమైన ఉధ్గాత వాయువులు పెరిగి వాతావరణ భూతాపం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల అటువంటి పరిస్థితిల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ను ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీ తో కూడి సులభతరమైన వాయిదా ల పద్దతిలో నెడ్ క్యాప్ ద్వారా అందచేస్తున్నట్లు తెలిపారు. వాతావరణములో కార్బన్ వాయువుకు తగ్గును, నిర్వహణ వ్యయం తగ్గుట, శబ్ద కాలుష్యం తగ్గుట వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో సోలార్ విద్యుత్ పై అవగాహన కోసం నాలుగు అర్భికే ల పరిధిలో ఉచితంగా సోలార్ ట్రాప్పర్స్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. జిల్లా నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ జీ. సత్యనారాయణ, డెవలప్మెంట్ అధికారులు కే. శివ బాల కుమార్, ఉదయ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *