-MS బేగ్, జిల్లా. కార్యాలయం కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల పై భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో పలు పథకాల పై మహానాడు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం చాలా ఆనందము ఉంది అని అన్నారు తరువాత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆదుకునే విధంగా ఉందని,అన్నదాతకు ఏడాదికి రూ. 20000. రాష్ట్రం లో ఇంటింటికి మంచినీరు,బిసిలకు రక్షణ చట్టం పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేస్తాం- ఆదాయం రెట్టింపు చేస్తాం అని తెలియపరచడాన్ని తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలపై ఎంత అభిమానం ఉందో అని చెప్పండడానికి నిదర్శనం అన్నారు.
తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సరిత మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలు – నెలకు రూ.1500ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు తల్లికి వందనంపేరు తో ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు మరియు దీపం పథకం పేరు తో పేద మహిళా కి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మరియు ఉచిత చదువు మరియు ఉద్యోగం చేసే మహిళలకు ఉచిత ప్రయాణం ఇవి అని ప్రవేశ పెడుతున్న చంద్రబాబు కి మహిళా లు ఎప్పుడు రుణపడి ఉంటారు అన్నారు.
అనంతరం తెలుగు యువత అధ్యక్షుడు రాళ్లపూడి మాధవ మాట్లాడుతూ నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర లో యువగళం విన్నాం పేరు తో – 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు అంతే కాకుండా యువతని వారు ఉపాధి ప్రేరేపించే విధంగా యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇచ్చినా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి యువత ఎప్పుడు రుణపడి ఉంటుంది అని అన్నారు ఈ కార్యక్రమం లో పశ్చిమ నియోజకవర్గం టీం. టిడిపి నాయకులు దనేకుల వెంకట సుబ్బారావు, మైనారిటీ నాయకులు sk హబీబ్ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి లు కమిటీ సభ్యులు టిడిపి అభిమానలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News