Breaking News

“జర్నలిస్టులు – భాష పరిజ్ఞానం – పదునైన భాష వాడకం” అంశం పై ప్రసంగం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యం లో నిర్వహిస్తోన్న “డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులతో పాటు, రాష్ట్రం లోని వర్కింగ్ జర్నలిస్టులకు ఆన్ లైన్ అవగాహనా తరగతుల్లో భాగంగా ఈ శనివారం (03-06-23) న రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జి.వి.డి. కృష్ణ మోహన్ ప్రత్యేక ప్రసంగం ఇవ్వ నున్నారని ఆ సంస్థ చైర్మన్  కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. “జర్నలిస్టులు – భాష పరిజ్ఞానం – పదునైన భాష వాడకం”, అనే అంశం పై శనివారం ఉదయం 9నుంచి 10 గంటల వరకు శ్రీజి.వి.డి. కృష్ణ మోహన్ ప్రసంగిస్తారని ఆ ప్రకటన లో చైర్మన్ పేర్కొన్నారు. పత్రికా రంగంలో విశేష అనుభవం కలిగిన జి.వి.డి. కృష్ణ మోహన్ అనుభవాన్ని ప్రసంగ రూపంలో అందించడం గొప్ప అవకాశమని,”డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే రోజు “నేటి ప్రసార మాధ్యమాలు” అనే అంశంపై రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్. అనంత పద్మనాభ రావు ఉదయం 8నుంచి 9గంటల వరకు ప్రత్యేక ప్రసంగం ఇస్తారని, డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జూమ్ అప్లికేషన్ ద్వారా అవగాహన తరగతులకు హాజరవ్వటానికి కావాల్సిన వివరాలు :

Meeting ID: 815 9892 6979
Passcode: 12345

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *