విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల నాలుగో తేదీ ఆదివారం మధ్యాహ్నం నుండి ఏడో తేదీ బుధవారం వరకు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాదు నుండి విజయవాడ చేరుకున్న యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కు నోవాటెల్ హోటల్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. యం సుహాసిని స్వాగతం పలికారు.
యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ 4 5వ తేదీ లలో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈనెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం 9:30 గంటల నుండి 10 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లాలోని జి. కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రధానమంత్రి మాతృ వందన యోజన లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 10 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఏ కొండూరులో ఎమ్ ఎస్ ఎంఇ, కిసాన్, టిడ్కో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. ఏడో తేదీన నగరంలో చాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ పర్సన్స్ తో సమావేశం జాతీయ ప్రాజెక్టుల పరిశీలన చేస్తారు.
Prajavartha Online Telugu News