-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను స్వీయానుభవ ప్రక్రియ ద్వారా వెలికి తీయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఉపయోగపడుతాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ‘రాష్ట్ర స్థాయి అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ లో ఇంజినీరింగ్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు బోధన’ అంశంపై మూడు రోజుల పాటు జరిగే కార్యశాలను మంగళవారం పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బీసీడీఈ (బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రు ఎడ్యుకేషన్) అనే ఒక బృహత్తర కార్యక్రమం ద్వారా యూనిసెఫ్, సమగ్ర శిక్షా, పాఠశాల విద్యాశాఖ, విజ్ఞాన్ ఆశ్రమం సంయుక్తంగా ఈ వినూత్న ప్రక్రియను చేపట్టాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ఏడు అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ స్కూల్లో బోధించడానికి విద్యార్థులు స్వచ్ఛదంగా హాజరయ్యారు. ఈ విద్యార్థులను ఎస్పీడీ బి.శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఎస్పీడీ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు ప్రయోగాత్మక విద్యను అందిపుచ్చుకోవాలన్నారు. దీనికోసం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్ లను సద్వినియోగపరచుకోవాలన్నారు. జాతీయస్థాయి విద్యావిషయక నిపుణులు గణేష్ నిగమ్, శేషగిరి మధుసూదన్, దక్షిణ భారత
Prajavartha Online Telugu News