-దక్షిణ భారత మార్కెట్లో ప్రధాన వాటాదారుగా నిలిచిన మెల్లో
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల్లో దేశీయ ‘ఆయుర్వేద హబ్’గా పేరుగాంచిన మెలో హెర్బల్స్ ఉత్పత్తులు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ ఏడాదిలో గత కొన్ని నెలలుగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మెలో హెర్బల్స్ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నాణ్యతకు పేరుగాంచిన మెల్లో సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల్లో ‘ఫ్లాగ్ షిప్’గా లిప్ ట్రీట్‌మెంట్ ప్రొడక్ట్ నిలవడం విశేషం. అంతే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి ఉత్పత్తి అవుతున్న మెల్లో ఉత్పత్తులన్నింటిలో అత్యధికంగా సౌందర్య ప్రియులను ఆకర్షిస్తున్న పెదవుల సంరక్షణ కోసం వినియోగించే లిప్ ట్రీట్‌మెంట్ అగ్రభాగాన నిలిచి, మొత్తం బ్రాండ్ ఆదాయంలో 90 శాతం ఆదాయాన్ని సమకూరుస్తోంది.
మెల్లో అనేది ప్రముఖ పాన్- ఇండియా పర్సనల్ కేర్ బ్రాండ్, ఇది వినియోగదారులకు ఉత్తమమైన ఆయుర్వేద ఉత్పత్తులను అందించి, వారి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఆధునిక కాలానికి అనుగుణంగా, పురాతన ఆయుర్వేద జ్ఞానాన్ని, సాంకేతికతను మిళితం చేసి తన ఉత్పత్తులను రూపొందిస్తుంది. మెల్లో ఉత్పత్తుల్లో అగ్రభాగాన నిలిచిన లిప్ ట్రీట్‌మెంట్.. బాదం నూనె, టంకనామల్, జసదా భస్మం వంటి ఆయుర్వేద ముడి పదార్థాల గుణాలతో రూపొందించినది. బాహ్య వాతావరణం ఎలా ఉన్నా, అన్ని కాలాలలో పెదవులు పగిలినా, పొడిబారినా వాటిని నయం చేసి ఎక్కువసేపు మెరిసేలా, ఆకర్షణీయంగా మారుస్తుంది. అంతేకాకుండా పెదవులను మృదువుగా మారేలా పోషణనందించి తాజా అనుభూతిని అందించడంలోనూ సహాయపడుతుంది.
స్త్రీ, పురుషులెవరైనా ఉపయోగించగలిగేలా రూపొందించిన ఈ మెల్లో లిప్ ట్రీట్‌మెంట్ ఉత్పత్తిలోని సుగుణాలు, మెరిసే రూపం, ఎటువంటి పళ్ల రుచినీ(మార్కెట్లోని పోటీ ఉత్పత్తుల తరహాలో కాకుండా) కలిగి ఉండకపోవడం యువతను అమితంగా ఆకట్టుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పలు టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోని యువత ఎక్కువగా కోరుకునే ఉత్పత్తిగా మారింది. లిప్ ట్రీట్‌మెంట్‌తో పాటు, మెల్లో క్రాక్ హీల్ క్రీమ్, కుంకుమాది తైలం తదితర ఇతర ఉత్పత్తులు కూడా దక్షిణ భారతదేశం అంతటా విస్తృత ప్రజాదరణ పొందుతున్నాయి.
ఈ సందర్భంగా మెల్లో హెర్బల్స్ వ్యవస్థాపకులు, సీఈవో వైశాలి శారద మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలు మెల్లో వ్యాపార వృద్ధికి కేంద్రంగా మారడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రత్యేకించి, మెల్లో లిప్ ట్రీట్‌మెంట్ ఆయా ప్రాంతాల్లోని సౌందర్య ప్రియులను విస్తృతంగా ఆకర్షిస్తోంది. ఈ డిమాండ్ దృష్ట్యా నైకా(Nykaa), ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మెల్లో సొంత వెబ్ సైట్ సహా పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలోనూ తమకు భారీగా ఆర్డర్‌లు పెరిగాయని వివరించారు.
ఆయుర్వేదం పుట్టిన మన దేశంలో ఆయుర్వేద మూలికలతో తయారవుతున్న మెల్లో హెర్బల్స్ దక్షిణ భారత మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌తో ప్రధాన వాటాదారుగా ఉద్భవించడం గమనార్హం. ఈ ప్రజాదరణ దృష్ట్యా మెల్లో ఉత్పత్తులను దక్షిణ భారతదేశంలోని ప్రతి ప్రాంతానికీ చేర్చేందుకు, ఉత్పత్తులు, బ్రాండ్‌పై మరింత అవగాహన పెంచేందుకు విస్తరణ కార్యక్రమాలు చేపట్టనుంది. అందుకోసం, కంపెనీ తమ ఉత్పత్తులను అన్ని ఆయుర్వేద స్పాలు, మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలతో పాటు దక్షిణ భారతంలోని ఎంపిక చేసిన బోటిక్ ఆర్గానిక్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. అంతే కాకుండా మెల్లో భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇప్పటికే మెల్లో ఉత్పత్తులను ఆదరిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్ తదితర దేశాల్లోనూ విస్తృతంగా అందుబాటులోకి తెచ్చి, అంతర్జాతీయ మార్కెట్‌లలోకి ప్రవేశించడం వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది.
Prajavartha Online Telugu News