విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనుకోకుండా జరిగే ప్రమాదాలలో గాయపడినా, లేదా తప్పిపోయినా లేదా మరణించిన వ్యక్తులు యొక్క సమాచారాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియజేసే తెలుసుకునే ట్యాగ్ ఆపద్బాంధవ ఫ్యామిలీ ఇంటిమేషన్ ట్యాగ్ క్యూ ఆర్ కోడ్ తో డిజైన్ చేశామని, కంప్యూటర్ సాఫ్ట్ వెర్ డెవలపర్ వాసంశెట్టి దుర్గామల్లేశ్వరరావు అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం లాంటి అనుకోకుండా జరిగే ఎటు వంటి ప్రమాదాల లోనైనా, యాక్సిడెంట్లు, ఇతరత్రా ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమందికి వాళ్ళు. వాళ్ళ అచూకీ తెలియకుండా పోతుందని, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి పరిస్థితులను తెలియజేసే క్యూఆర్ కోడ్ తో ఒక ట్యాగ్ ను డిజైన్ చేశామని, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ట్యాగ్ ధరించి ఇంటి నుండి బయటకు పని మీద వెళ్లే ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే వారికి వారి కుటుంబ సభ్యులకు ఉ పయోగపడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు పక్కనున్న ఎవరైనా ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం, రెస్క్యూ టీం/హెల్ప్ డెస్క్/ హెల్ప్ లైన్/ వాళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి మొబైల్ తో క్యూఆర్ కోడ్ స్కానర్ స్కాన్ చేస్తే మొబైల్ వ్యక్తి యొక్క ఫ్యామిలీ సమాచారం స్క్రీన్ వస్తుంది . ఆ ఫ్యామిలీ సమాచారం స్క్రీన్ లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్ సింబల్ వాట్సాప్ సింబల్స్ వస్తాయని, ఆ సింబల్స్ పై క్లిక్ చేసి వాళ్లకు గురించి వివరించవచ్చని అన్నారు. స్క్రీన్ పై పోలీసు, అంబులెన్స్ సింబల్స్ ఉంటా యని అన్నారు. విధంగా ట్యాగ్ ధరించిన వ్యక్తికి అనుకోకుండా ఏదైనా జరిగితే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియజేసే అవకాశాన్ని ఈ కోడ్ ఉన్న ట్యాగ్ ద్వారా కలుగుతుందని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వానికి కాకుండా రైల్వే, ఆర్టీసీ, ఎల్ ఐ సి, మరియు ఎన్నో సంస్థలకు బాగా ఉపయోగకరంగా వుండగలదని అన్నారు. ఈ ట్యాగ్ ను ఇండివిడ్యువల్ గా గాని గ్రూపుగా గాని ప్రిపేర్ చేసి ఇవ్వగలమని, ఈ ట్యాగ్ కావలసిన వాళ్లు వాట్సాప్ నెంబర్ 9963851527 కు రిక్వెస్ట్ మెసేజ్ పంపిస్తే మీకు వివరాలు తెలుపగలమని అన్నారు.
Prajavartha Online Telugu News