విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం 2వ డివిజన్ కుమ్మరి బజార్ నెహ్రు గారి విగ్రహం నందు 15లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన సి.సి రోడ్డు నిర్మాణ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు ఈ రోడ్లు దుస్థితి గురుంచి అవినాష్ దృష్టికి తీసుకురాగా నాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని, వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో కొండప్రాంతా అభివృద్ధి గాలికొదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసారని విమర్శించారు. విజయవాడలో కొండప్రాంతం అధికంగా ఉన్న నియోజకవర్గాలలో తూర్పు కూడా ఒకటి అని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టీ నూతన మెట్ల మార్గాలు, సైడ్ డ్రైనేజీ, మంచినీటి కుళాయి లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ నాలుగేళ్ళ కాలంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగింది అని దమ్ముగా ధైర్యంగా చెప్పగలం అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ అధ్యక్షులు కోటి నాగులు వైస్సార్సీపీ నాయకులురవి ప్రకాష్ పెదబాబు,కనపర్తి బాబు, డేవిడ్ రాజు, చంద్ర, రాఘవయ్య ,మస్తాను, చెన్ను,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News