Breaking News

ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించడానికే జగనన్న సురక్ష

-దేవినేని అవినాష్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ వంద శాతం సంక్షేమ ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ సేవ‌లు అందాల‌నే ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం “జ‌గ‌న‌న్న సుర‌క్ష” కార్య‌క్ర‌మాన్ని అమ‌లు అమలు చేసింది అని తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ దేవినేని అవినాష్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి పేర్కొన్నారు. బుదవారం నాడు 8వ డివిజన్ గాయత్రినగర్ 272 సచివాలయం లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 62,63,64,272,44 సచివాలయల ప్రజలకు 532 మందికి సర్టిఫికెట్లు ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ అర్హత వుండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు అందెటట్లు చర్యలు తీసుకొనేటట్లు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది అని చెప్పారు.అన్ని స‌చివాల‌యాల ప‌రిధిలో వాలంటీర్లు ఇంటింటి స‌ర్వే చేసి.. అవ‌స‌ర‌మైన సేవ‌ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించార‌న్నారు. వాటిని స‌చివాల‌యాల వారీగా “జ‌గ‌న‌న్న సుర‌క్ష” శిబిరాల్లో ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్య మంత్రిగా చేసుకోవాలని అప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుతాయి అని చెప్పారు.ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే ప‌రిపాల‌న‌ను తీసుకెళ్లి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సేవ‌లు అందించే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమలు చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్, MRO వెంకటరామయ్య, విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *