
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేతివృత్తిదారుల సమాఖ్య, అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య, ఓబిసి 8వ జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ కన్వీనర్ కె.ఆల్మెన్ రాజు సూద్ర మాట్లాడుతూ ఆగస్టు నెల 7వ తేదీన తిరుపతిలో ఓబిసి కులాల 8వ జాతీయ మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరియు జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. ఓబిసి 8వ జాతీయ మహాసభకు రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు, కుల సంఘాలు నాయకులు, ప్రజలందరూ రావలసిందిగా పిలుపునిచ్చారు. ఈ ఎనిమిదవ మహాసభలో వెనుకబడిన తరగతుల బీసీ కులాలకు, రాజకీయంలోనూ, రాజ్యాధికారంలోనూ, అవకాశం కల్పించే దిశగా, ఓబిసి కులాలకు చెందిన వారందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి స్టేట్ కార్పంటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాటికొండ రంగబాబు, ఆర్టిసన్స్ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ వి.బి.భాస్కరబాబు, ఓబీసీ కులాల విజయవాడ టౌన్ అధ్యక్షుడు చందు సూద్ర, ఎన్టీఆర్ కృష్ణాజిల్లా ఓబిసి కులాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News