Breaking News

పరుగులు పెడుతున్న సెంట్రల్ అభివృద్ధి

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లో రూ. 20 లక్షల నిధులతో నూతన రహదారి నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజల నుంచి విజ్ఞాపనల మేరకు సింగ్ నగర్ ఫ్లైఓవర్ ఆరంభం నుంచి రైతు బజార్ – ఎమ్మార్వో కార్యాలయం వెనుక రోడ్డు మీదుగా రైల్వే ట్రాక్ వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో డివిజన్లో కనీసం సైడ్ కాలువలు నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు అనేక అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలను వెచ్చించినట్లు తెలిపారు. మరోవైపు అజిత్ సింగ్ నగర్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. వాంబేకాలనీ నుంచి గుణదల., డిస్నీల్యాండ్ నుంచి గుణదల., హెచ్ బ్లాక్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఇలా మూడు మార్గాలను అభివృద్ధి పరిచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరలో ఈ రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలున్నా అన్ని వేళలా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని మల్లాది విష్ణు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, కంభగళ్ల రాజు, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నేరెళ్ల శివ, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *