Breaking News

మెడిసి హాస్పిటల్స్ ను ప్రారంభించిన మంత్రులు బొత్స , రజని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైద్యరంగంలో అభివృద్ది దిశగా కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడుదల రజని పెర్కొన్నారు . ప్రభుత్వం తోపాటు ప్రయివేటు రంగంలో అనేక పేరొందిన విద్యాలయాలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఆదివారము రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణతో కలిసి మొగల్ రాజపురం లో మెడిసి హాస్పిటల్స్ విజయవాడ శాఖను లాంచనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను నిశితంగ పరిశిలించారు. మెడిసి హస్పిటల్స్ ద్వారా అందే సేవలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బగా మాట్లడుతూ ఇప్పటివరకు హైదరాబాదు నగరంలో ఉన్న మొడిసి ఇప్పుడు విజయవాడ కు రావటం , త్వరలో విశాఖపట్నంలో కూడా నూతన శాఖను ఏర్పాటుచేయనుండటం అభినందనియామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్యరంగంలో మార్పులను డాక్టర్లు చికిత్స విధానంలో అనుసరించి అనేక అద్బుతాలు ఆవిష్కారిస్తున్నారన్నారు. మెడిసి హాస్పిటల్స్ లో ఐవిఎఫ్, రిహాబ్ సెంటర్ల ప్రయోజనాలకు అందరూ వినియోగించుకోవాలని కోరారు. నిష్ణాతులైన వైద్యులు ఈ మెడిసి హోపిటల్స్ కు రుపకల్పన చెయడం జరిగిందని పెర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో దేశంలోని ఒకటో స్తానంలో వుందని వెల్లడించారు. ఈకార్యక్రమంలో మెడిసి ఫౌండర్ ఆండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ బి.శిరీషారాణి, క్లినికల్ డైరెక్టరు డాక్టర్ వి.పద్మజ, సిఇవో జి .ధర్మతేజా, విజయవాడ నగరంలోని అనేకమంది ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *