Breaking News

దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో గోధుమలు, బియ్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా ఆటా మరియు బియ్యం రిటైల్‌ ధరలలో ద్రవ్యోల్బణ ధోరణిని స్థిరీకరించడానికి/ నియంత్రించడానికి ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ (డొమెస్టిక్‌) ద్వారా బహిరంగ మార్కెట్‌లో గోధుమలు మరియు బియ్యాన్ని తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పైన పేర్కొన్న వాటిని అమలు చేయడానికి, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి 19.07.2023న 4వ ఈ- వేలం ద్వారా 1400 ఎంటిల గోధుమలు మరియు 7000 ఎంటిల బియ్యాన్ని అందించింది, ఇందులో 9 మంది బిడ్డర్లు పాల్గొన్నారు మరియు 900 ఎంటిల గోధుమలు విక్రయించబడ్డాయి. ఇ- వేలం కోసం, 26.07.2023 తేదీన 1100 ఎంటిల గోధుమలు మరియు 7000 ఎంటిఎస్‌ బియ్యం ఓఎంఎస్‌ఎస్‌ (డి) కింద అందించబడతాయి. ఆసక్తి ఉన్న పిండి మిల్లులు/ గోధుమ/ వరి ఉత్పత్తుల తయారీదారులు తదుపరి నమోదు మరియు ఈ- వేలంలో పాల్గొనేందుకు www.valuejunction.in/fciలో ఎం.జంక్షన్‌ని సంప్రదించవచ్చని ఎఫ్‌సిఐ, ఎపి, జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *