Breaking News

ప్రతిపక్ష నాయకులు కూడా అభినందించే విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గెలుపోటములతో సంబంధం లేకుండా కోట్ల రూపాయలు వెచ్చించి విజయవాడ నగరంలో ఉన్న అన్ని డివిజన్ లను అభివృద్ధి చేస్తూ ప్రతిపక్ష కార్పొరేటర్లు కూడా మెచ్చుకొనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పాలన అందిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ 8వ డివిజన్ నందు దాదాపు 60 లక్షల రూపాయల గడపగడపకు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఈ డివిజన్ లో ఓటమి చెందిన సరే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ డివిజన్ లోని ప్రతి ప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అదే గత తెలుగుదేశం ప్రభుత్వం లో అయితే ఓడిపోయిన డివిజన్ లో కార్పొరేటర్ లు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న, ఎన్ని అర్జీలు ఇచ్చిన అసలు పట్టించుకోలేదు అని విమర్శించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇటీవల మాట్లాడుతూ ఏవో చిన్న చిన్న రోడ్లు మాత్రమే వేస్తున్నారు అని మాట్లాడుతున్నారని, బహుశా ఆయనకు జరిగిన కంటి ఆపరేషన్ వల్ల కళ్ళకు కనపడటం లేదు ఏమో అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి గద్దె ఇంట్లో నుండి బయటకు వచ్చి చుస్తే ఆయన ఇంటి చుట్టుపక్కలే ఎన్ని రోడ్లు పడ్డాయి, ఎంత అభివృద్ధి జరిగింది అనేది తెలుస్తోంది అని హితవు పలికారు. మా టీడీపీ ప్రభుత్వం లో కంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లోనే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్వయంగా ఆ పార్టీ కార్పొరేటర్లే ముందుకు వచ్చి మాకు తెలుపుతున్నారని అది మా ప్రభుత్వ పనితీరు కు నిదర్శనం అని అన్నారు. రిటైనింగ్ వాల్ గాని, కరకట్ట ప్రాంత అభివృద్ధి గాని, కొండ ప్రాంత అభివృద్ధి గాని ఎవరి హయాంలో జరిగిందో ప్రజలను అడిగితే వారే చెబుతారు అని,అంతేగాని మైకు దొరికింది కదా అని పేపర్లో పడాలి అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు అని తెలిపారు. ఇకనైనా గద్దె పద్దతి మార్చుకుని హుందాగా రాజకీయాలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. డివిజన్ ఇన్ ఛార్జ్ గా ఉన్న యలమంచిలి జయప్రకాష్ పార్టీ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, వారి వైయన్ఆర్ చారిటీస్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ యలమంచిలి జయప్రకాష్, కార్పొరేటర్ శ్రీమతి చెన్నుపాటి ఉషారాణి, వైస్సార్సీపీ నాయకులు శివ, రిజవాన్, ఉదయ్, జై హింద్ రావు, అబ్దుల్ గఫూర్, అబ్దుల్ కరీం మునీర్ రవి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *