Breaking News

చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు…

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం పోలవరం ప్రాజెక్ట్ కు శనిలా వెంటాడుతోందని రాష్ట్ర వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే సమయానికి పోలవరం పనులు, తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిని నాడు-నేడు విధానంలో అధికారులకు, పాత్రికేయులకు ప్రాజెక్ట్ సైట్ లో పర్యటించి తెలియజేసారు. అనంతరం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో పాత్రికేయులతో మంత్రి రాంబాబు మాట్లాడుతూ దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో వేగవంతమైన పోలవరం పనులను ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని, ప్రాజెక్ట్ పనులపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డాం లు, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్ ఛానెల్,స్పిల్ వే పూర్తి చేయకుండా నది నీరు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే చంద్రబాబు నాయుడు చేసిన చారిత్రాత్మకమైన తప్పిదమని, దీని కారణంగానే 2019-20 లలో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదన్నారు. చంద్రబాబు నాయుడు ని తాను ఎప్పటినుండో తన ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసిన జాతీయ ప్రాజెక్ట్ ను తాను నిర్మిస్తానని ఎందుకు ఒప్పుకున్నారని, 2018 లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని ఎందుకు పూర్తి చేయలేక పోయారని, ఎగువ, దిగువ కాఫర్ డాం లు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారని, 2016 సంవత్సంలో 2013-14 రేట్లు ప్రకారం నిర్మిస్తామని కేంద్రం ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ప్రాజెక్ట్ లపై, వ్యవసాయం పై చిత్తశుద్ధి లేదని, ఎన్నికల ప్రచారం కోసమే ప్రాజెక్ట్ ల వద్దకు పర్యటిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు 45. 72 కాంటూర్ కె నిర్మిస్తామని, 41. 15 తగ్గిస్తామని ప్రచారం నిజం కాదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో మూడు దశలు ఉంటాయని, మొదటి దశలో 41. 15 కాంటూర్ వరకు నిర్మించి నీటి నిల్వ చేసి పరిశీలిస్తామని,ఏమైనా సమస్యలు ఉంటె గుర్తిస్తామన్నారు, సరిచేస్తామన్నారు. అనంతరం రెండవ దశ లో కూడా అదేవిధంగా పరిశీలిస్తామన్నారు. చివరిగా 45. 72 కాంటూర్ తో ప్రాజెక్ట్ ను నిర్మిస్తామన్నారు. నిర్మిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 194 టి.ఎం.సి., నీటిని నిల్వ చేసే సామర్ధ్యం గల ప్రాజెక్ట్ అన్నారు. 56 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుంటుందన్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు 2016 సంవత్సరంలో నమోదైదందన్నారు. 41. 15 కాంటూర్ వరకు 119 టి.ఎం.సి., నీరు నిల్వ సామర్ఢ్యము ఉంటుందన్నారు. 2017-18 సంవత్సరం రేట్ల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 55 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. 41. 15 కాంటూర్ వరకు 20 వేల 946 కుటుంబాలకు కుటుంబాలు నిరాశ్రయులవుతారని, వారికి పునరావాసం కల్పించాలన్నారు. 45. 72 కాంటూర్ కు మరో 16 వేల 642 కుటుంబాలు నిరాశ్రయులవుతారని, వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ మొదటి దశలో 41. 15 కాంటూర్ వరకు నిర్మాణానికి 19 వేల కోట్ల రూపాయలు ఖర్చువుతుందని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ నిమిత్తం 7394 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎక్కడా ఆగలేదన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా చేసిన పనులను స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్ప్రోచ్ ఛానల్, స్పిల్ వె, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డాం లను తాము పూర్తి చేశామన్నారు. తాము పూర్తి చేసిన spillway పై చంద్రబాబు నడిచి వెళ్లి తమ ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే నన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచారానికి, బస్సు యాత్రలకు, భోజనాలకు, బజనలకే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
మంత్రి వెంట పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య,,ఈయన్ సి నారాయణరెడ్డి, సిఇ సుధాకర్ బాబు, యస్ ఈ నరసింహమూర్తి, ప్రభృతులు ఉన్నారు. అధికారులు మీడియా ప్రతినిధులతో ఎగువ, దిగువ కాఫర్ డాం, స్పీల్ వే, దయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం తమ ప్రభుత్వం సమయాలలో చేపట్టిన నిర్మాణ పనులపై నాడు నేడు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *