– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-60 వ డివిజన్ 267వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ 267వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వాంబే కాలనీ జీ బ్లాక్ లో విస్తృతంగా పర్యటించి 276 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి కలిగిన లబ్ధి, వారి వ్యక్తిగత జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా కలిగిన మార్పును అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలతో 85 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉన్నామని తెలియజేయడం జగనన్న సంక్షేమపాలనకు నిదర్శమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన.. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన యాంటీ లార్వా డ్రైవ్
పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రాంతంలో యాంటీ లార్వా డ్రైవ్ ను నిర్వహించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన డ్రోన్ ద్వారా వెక్టో బ్యాక్ట్ పౌడర్ ను చల్లించారు. అలాగే దోమలు వృద్ధి కేంద్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి.. లార్వా దశలోనే నియంత్రించడంపై దృష్టిసారించాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు సూచించారు. మనుషులు చేరలేని హై రిస్క్ ప్రాంతాలలో డ్రోన్ సాయంతో మందును పిచికారి చేయించాలన్నారు. కాలువలు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేయించడంతో పాటు.. పగలు రాత్రి రెండు పూట్ల తప్పనిసరిగా ఫాగింగ్ నిర్వహించాలన్నారు.
ఎన్టీఆర్కు ద్రోహం చేసిన 420 ఎవరో లోకేష్ చెప్పాలి
టీడీపీ నేత నారా లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు, నారాలోకేష్ లను మించిన 420 లు దేశంలోనే లేరని విమర్శించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తును లాక్కున్న 420 ఎవరో..? నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మేనిఫెస్టోను మాయం చేసిన 840 లు మీరు కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని ఒంటరిగా ఢీ కొనే సత్తా లేని టీడీపీ నేతలు మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మరోవైపు వరదలపై ప్రతిపక్ష నేత కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. హుదూద్, తిత్లీ తుఫాన్ల సమయంలో బాధితులకు ఏ మాత్రం పరిహారం ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నిత్యావసరాలు కూడా అందించలేదని.. పైగా కేంద్రం నుంచి వచ్చిన రూ. 1000 కోట్ల నిధులలో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులు పక్కదారి పట్టించారన్నారు. బాధితులకు సాయం ఎలా ఎగ్గొట్టాలన్నది చంద్రబాబు సిద్ధాంతమైతే.. ఎలా ఇవ్వాలన్నదే జగనన్న లక్ష్యమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కనుక చంద్రబాబు, లోకేశ్ లు ఎన్ని కుట్రలు చేసినా.. 2024 ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఢీకొనలేరని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా ఆఫీసర్ మోతీబాబు, బయాలజిస్ట్ సూర్యనాయక్, సీడీఓ జగదీశ్వరి, నాయకులు ఎండి ఇస్మాయిల్, ఎస్.డి.బాబు, పఠాన్ నాగుర్, షేర్ అలీ, షేక్ ఫాతిమా, కోడూరు గోపి, సిరిశెట్టి రాజా, ఉమా, సౌజన్య, పి.నాగరాజు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News