Breaking News

ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా బహిరంగ మార్కెట్లోకి గోధుమలు, బియ్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా గోధుమలు/ గోధుమ పిండి మరియు బియ్యం రిటైల్ ధరలను స్థిరీకరించడానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) ద్వారా బహిరంగ మార్కెట్‌లో గోధుమలు మరియు బియ్యాన్ని విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న బియ్యం మరియు గోధుమల ధరలను నియంత్రించడానికి, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) కింద 25 LMT బియ్యం మరియు 50 LMT గోధుమలను ఆఫ్‌లోడ్ చేయాలని నిర్ణయించారు. దీనికొరకు ప్రతివారం జరుగు ఇ-వేలం ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 2 LMT గోధుమలను అందుబాటులో వుంచుతారు. పైన పేర్కొన్న వాటి అమలు కోసం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి 30.08.2023 (బుధవారం)న నిర్వహించబడే ఇ-వేలం ద్వారా OMSS (D) కింద 4000 మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు 13018 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో వుంచుతారు. ప్రస్తుతం 769609 MTల బియ్యం మరియు 12125 MTల గోధుమలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ పూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద 796000 MTల బియ్యం అందుబాటులో వున్నవి. ఇ-వేలంలో పాల్గొనడానికి, EMD మొత్తాన్ని ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి వారి బ్యాంకుఖాతాకి సోమవారం (28.08.2023) సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఇప్పటినుండి ఒక PAN కలిగివున్న కొనుగోలుదారుడు దేశవ్యాప్తంగా 100 మెట్రిక్ టన్నుల గోధుమలను మాత్రమే వేలంలో పొందుటకు అనుమతించబడతారు. కొనుగోలుదారుడు ఆ నిర్దిష్ట రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే GST రిజిస్ట్రేషన్ మరియు టెండర్‌ను ప్రచురించిన తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్‌ని కలిగివుండాలి. ఆసక్తి ఉన్న పిండి మిల్లర్లు/ గోధుమ పిండి ప్రాసెసర్‌లు మరియు గోధుమ ఉత్పత్తుల తయారీదారులు తదుపరి నమోదు మరియు E-వేలంలో పాల్గొనేందుకు www.valuejunction.in/fciలో M-జంక్షన్‌ని సంప్రదించవచ్చు. FCI నుండి ఇ-వేలంలో గోధుమలను పొందిన బిడ్డర్లు, అలా పొందిన గోధుమలను పొందిన చివరి తేదీ నుండి ముప్పై (30) రోజులలోపు గోధుమ ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి, విక్రయించుట కోసం మార్కెట్‌లోనికి విడుదల చేయాలి. FCI నుండి ఇ-వేలంలో గోధుమలను పొందిన బిడ్డర్లు, అలా పొందిన గోధుమలను పొందిన చివరి తేదీ నుండి ముప్పై (30) రోజులలోపు గోధుమ ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి, విక్రయించుట కోసం మార్కెట్‌లోనికి విడుదల చేయాలి. బియ్యానికి సంబంధించిన వేలంలో, వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు మరియు కొనుగోలుదారుడు 1000MTల వరకు బియ్యాన్ని వేలంలో పొందుటకు అనుమతించబడతారు. ఇప్పుడు FRK బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2973/- మరియు FRK కాని బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2900/- లుగా నిర్ణయించబడ్డదని ఎఫ్‌సిఐ, ఎపి, జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *