Breaking News

గడప గడపకూ సంక్షేమ పథకాలు : హోంమంత్రి తానేటి వనిత

– జోరు వానలోనూ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించిన హోంమంత్రి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 127వ రోజు చాగల్లు మండలం చాగల్లులో ఆమె శనివారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలను ఆమె వివరించారు. ఏవైనా సమస్యలున్నా, అర్హులై ఉండి ఎవరికైనా పథకాలు అందకపోయినా వెంటనే తెలియజేయాలన్నారు. ఈ క్రమంలో పలువురు ఆమె దృష్టికి తీసుకువచ్చిన చిన్నచిన్న సమస్య లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గడప గడపకు కార్యక్రమం ప్రారంభమైన కాసేపటికి చిన్నగా వర్షం మొదలై క్రమంగా పెరిగింది. జోరు వానలో కూడా కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అర్హత ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ఏ ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందన్నారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి కనీసం లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు లబ్ధి చేకూరిందని తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *