-మంత్రి జోగి రమేష్
చినగొల్లపాలెం ( కృత్తివెన్ను ), నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు వాటిని వెంటనే పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మంత్రి జోగి రమేష్ కృత్తివెన్ను మండలం చినగొల్లగపాలెం గ్రామ సచివాలయం-1 పరిధిలోని బత్తుల వారి బజారు,సానా వారి వీధి, దేశాబత్తులపేట, క్రిస్టియన్ పేట,రైతుల పేట,యేటిపవరు తదితర ప్రాంతాల్లో కాలినడకన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటించారు.
తొలుత ఆయన పోతుల పెద్దింట్లమ్మ, కోనసాని రాజేశ్వరి, కూన బత్తుల వెంకటలక్ష్మి, తూము జ్యోతి, పువ్వాడ రమేష్, డేసాబత్తుల చిన గాబ్రియేలు, చాబత్తుల డేవిడ్, ఉండి మరియాదాస్, మత్తె జోస్ మేరీ, బంటుమిల్లి సునీత, చిలకపాటి మేరమ్మ, కట్టా జయలక్ష్మి, చెల్లుబోయిన వెంకట లక్ష్మి, దొంగ శ్రీదేవి తదితరుల ఇళ్లకు మంత్రి జోగి రమేష్ సందర్శించారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన వారు ఎవరైనా వుంటే వారికి ఎవరికైనా పథకాలు రాకుంటే అలాంటి వాటికి పరిష్కరించాలంటూ సచివాలయం ఉద్యోగులను మంత్రి జోగి రమేష్ ఆదేశించారు
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ స్థానికులతో మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాల్లో,పట్టణాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అని ఎక్కడికి వెళ్ళిన కూడా ప్రజలు సతోషం వ్యక్తం చేస్తున్నారు అని ఇంక కొంత మందికి ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల రాలేని వారికి వాటిని పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పారు.పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 99 శాతం మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని అలాంటి మంచి నాయకుడిని మళ్ళీ మనం రెండోసారి ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే మనమందరం సంతోషంగా జీవనం కొనసాగించగలమన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి జోగి రమేష్ పిలుపు నిచ్చారు
చిన గొల్లపాలెం సచివాలయం-1 పరిధిలో ప్రజా సమస్యలను తప్పక పరిష్కరిస్తానని మంత్రి జోగి రమేష్ తెలిపారు. క్రిస్టియన్ పేటలో స్మశాన వాటికకు వెళ్లే దారి కోసం ఒక సెంటు భూమిని కొంటామని, అలాగే ఆ మార్గాన్ని మెరక చేస్తామని అన్నారు. ఎక్కడైతే వీధిలైట్ల వెలగడం లేదో ఆయా ప్రాంతాల్లో వెలిగేలా చేస్తామని, వర్షాకాలంలో నీటితో మునిగిపోతున్న రహదారిని మెరక చేయించి రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపరుస్తానని మంత్రి జోగి రమేష్ స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిన గొల్లపాలెం సర్పంచ్ పెనుమాల సునీల్, కృత్తివెన్ను మండల జెడ్పీటీసీ మైలా రత్న కుమారి, పార్టీ మండల కన్వీనర్ రాజబాబు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ పాలపర్తి జాన్ రత్నం, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ జెల్లా భూపతి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పిన్నెంటి మహేష్, ఏఎంసీ చైర్మన్ గంగాధరరావు, తాహిసిల్దారు రామకోటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ వెంకట కృష్ణ మోహన్ , ఎలక్ట్రికల్ ఏఈ కందుల వెంకన్న, పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News