Breaking News

వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు.
-64 వ డివిజన్ 282 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ 282 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు  శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. కండ్రికలో విస్తృతంగా పర్యటించి.. 328 గడపలను సందర్శించారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఒరవడిని స్థానికులకు వివరించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన బుక్ లెట్లను లబ్ధిదారులకు అందించారు. గ‌త ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా భ్రష్టు పట్టించారు.. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను ఏవిధంగా గాడిలో పెడుతున్నదీ ప్రజ‌లకు వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీ పాలనను అందించడంలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారి ఇంటి ముందుకే సంక్షేమ పథకాలు అందజేస్తుండటంతో ఏ గడప తొక్కిన ప్రజల ఆదరణ అపూర్వంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సచివాలయ పరిధిలో రూ. 10.71 కోట్ల సంక్షేమం
సచివాలయ పరిధిలో గత నాలుగేళ్లలో అక్షరాలా 10 కోట్ల 71 లక్షల 28 వేల 129 రూపాయల సంక్షేమాన్ని పేదలకు అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 565 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 468 మందికి రూ. 64.65 లక్షలు., ఆసరా ద్వారా 745 మందికి రూ. 59.60 లక్షలు., సున్నావడ్డీ ద్వారా 875 మందికి రూ. 35 లక్షలు., చేయూత ద్వారా 266 మందికి రూ. 49.87 లక్షలు., కాపు నేస్తం ద్వారా 34 మందికి రూ.5.10 లక్షలు., జగనన్న తోడు ద్వారా 60 మందికి రూ. 6 లక్షలు., వాహనమిత్ర ద్వారా 55 మందికి రూ. 5.55 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందజేసినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 475 మందికి సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఇద్దరూ కలిసి పోటీ చేసినా ఒరిగేదేమీలేదు..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి పోటీ చేసినా ఒరిగేదేమీ ఉండదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. ప్రతిపక్షాలకు పొత్తులే ముఖ్యమని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తాయన్న విషయాన్ని వైఎస్సార్ సీపీ ఏనాడో చెప్పిందన్నారు. యువత భవిష్యత్తుతో ఆటలాడిన ఓ ఆర్థిక నేరస్తుడిని జనసేన అధినేత వెనకేసుకొస్తుండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు రిమాండ్ పై నిరసన తెలపడానికి టీడీపీ నాయకులే ముందుకు రానిపక్షంలో.. పవన్ కళ్యాణ్ హడావుడి వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు 13 చోట్ల ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో సీఐడీ చీఫ్ క్లియర్ గా చూపినా.. ఆధారాలతో సహా దొరికిన దొంగను ఎలా సమర్థిస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు బాబు పార్టనర్‌ గా ఉన్నది మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. అప్పట్లో బాబు అవినీతిని ప్రశ్నిస్తానన్న పవన్‌.. ఎందుకు నిద్రమత్తులో ఉండిపోయారన్నారు. పైగా చంద్రబాబుతో కలిసి ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. సిద్దాంతాలు లేని పార్టీలన్నీ ఏకమై వచ్చినా.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కోలేవని మల్లాది విష్ణు అన్నారు. 60 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని.. కనుకనే విపక్షాలన్నీ భయపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కనుక టీడీపీ, జనసేనల లోపాయికార ఒప్పందాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు మరోసారి గట్టిగా బుద్ది చెప్పడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు యరగొర్ల రాములు, ఇస్మాయిల్, జిల్లెల్ల శివ, పందిరి వాసు, మేడా రమేష్, విన్నకోట నాగు, మాతా మహేష్, వెంకటేశ్వరమ్మ, విమల, తాండవ కోటి, కిరణ్, కృప, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *