Breaking News

మట్టి వినాయకుడిని పూజిద్దాం : జిల్లా కలెక్టర్

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
మట్టి వినాయకుడిని పూజిద్దాం , భక్తి తో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఈ ఏడాది మొదటి పండుగ జరుపుకుందామని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక తుడా మైదానం ఇండోర్ స్టేడియంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆహ్వానము మేరకు జిల్లా కలెక్టర్ హాజరై విఘ్నేశ్వరునికి పూజలు చేసి, మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం గోడపత్రికలను ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని నగరంలో టీటీడీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయని సహకరించాలని అన్నారు. తిరుపతి నగర వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తున్నoదుకు అభినందిస్తున్నానని అన్నారు. గత సంవత్సరం చెన్నాయ గుంట దామినేడు వద్ద నిమజ్జనంలో ఇబ్బందులు కలిగాయని గుర్తించి వాటికోసం ఈ ఏడాది తుడా విసి హరికృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి కి ఆదేశాలు ఇచ్చామని బ్యారికెడు ఏర్పాట్లను సౌకర్యాలను పరిశీలిస్తారని అన్నారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని , లక్షల విగ్రహాలు పూజింపబడతాయని మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని వుండదని తెలిపారు. తిరుపతి నగరంలో దాదాపు 800 వరకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ఈనెల 18న వినాయక చవితి రోజు పూజలు నిర్వహణ చేపడతారని, మూడవరోజు నిమజ్జనానికి వినాయక సాగర్ నందు ఏర్పాట్లు జరిగాయని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఐదవ రోజు శుక్రవారం కావడం, తిరుమల శ్రీవారి గరుడ సేవ రోజు గా వుందని మూడవ రోజు నిమజ్జనానికి ప్రాధాన్యత నిస్తే బాగుంటుందని అన్నారు.

తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులు చామంచి శ్రీనివాస్, బాను ప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మునికృష్ణ, గోపాల్ రెడ్డి, గోపి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *