Breaking News

స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు ఊపునిచ్చేలా ‘స్వచ్ఛత హీ సేవ‘ ఉద్యమం

-ఆంధ్రప్రదేశ్ స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చేలా, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా “స్వచ్ఛత హీ సేవ” ఉద్యమానికి రాష్ట్ర స్వచ్చాంధ్ర కార్పొరేషన్ పునరంకితం కానుందని సంస్ధ ఎండి గంధం చంద్రుడు అన్నారు. శుక్రవారం నుండి దేశ వ్యాప్తంగా “స్వచ్ఛత హీ సేవ” పక్షోత్సవ కార్యక్రమం ప్రాంరభం కాగా, విజయవాడ స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చత హీ సేవ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నట్టు వివరించారు. గ్రామాల్లో, పట్టణాల్లో రోజుకో కార్యక్రమం నిర్వహించేలా కార్యక్రమాలు కొనసాగుతాయని, పక్షం రోజుల పాటు పరిశుభ్రత డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. పర్యాటక ప్రదేశాలు, మార్కెట్‌లు, జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, చారిత్రక స్మారక చిహ్నాలు, బీచ్‌లు, రివర్ ఫ్రంట్‌లు, ఘాట్‌లు వంటి అధిక జనసంచారం ఉన్న ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు.

కాలువలు, నల్లాలను శుభ్రం చేయడంతో పాటు చెత్త లేని బీచ్‌లు, కొండల కోసం సెప్టెంబర్ 17న ప్రత్యేక ర్యాలీ నిర్వహిస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలోని పారిశుద్య కార్మికులందరికి సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించడంతో పాటు వారందరికి మెరుగైన పథకాల రూపకల్పన దిశగా ముందడుగు వేస్తామన్నారు. స్వచ్చత హీ సేవా కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేసే క్రమంలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రత్రేక శ్రద్ద తీసుకుంటున్నామని గంధం చంద్రుడు తెలియజేశారు. స్వచ్ఛ భారత్‌ నిర్మించాలనే బాపు కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో స్వచ్చత హీ సేవ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయన్నారు. ఆక్టోబరు రెండు వరకు జరిగే రెండు వారాల సేవా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు స్వచ్చంద సంస్ధలు తమ వంతు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో కార్పోరేషన్ ఇడి ఊర్మిళ, సిఓఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *