-కిట్స్ లో క్రికెట్, వాలీబాల్, బ్యాట్మెంటన్, కోకో, కబాడి క్రీడా పరికరాలు
-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు చెందిన ఆడుకుందాం ఆంధ్రా కిట్స్ చేరుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం జేసీ ఛాంబర్ లో ఆడుకుందాం ఆంధ్రా కిట్స్ ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన 512 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమేరకు ఐదు క్రీడాలకు చెందిన కిట్స్ ను ఆంధ్ర ప్రదేశ్ క్రీడా సాధికారిత సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. క్రికెట్, వాలీబాల్, కబాడి, కోకో, బ్యాట్మెంటన్ లకు చెందిన రెండేసి కిట్స్ ను ఆయా సచివాలయలకి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో క్రీడల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరించినట్లు తేజ్ భరత్ తెలిపారు. తల్లితండ్రులు పిల్లల్లో ఆసక్తి ఉన్న క్రీడారంగంలో ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కోచ్ అధికారి ఏం వివి శేష గిరి, కోచ్ లు ఎన్.. మోహన్ దాస్, పివిజీ నాగేంద్రన్, ఎన్. నాగరాజు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News