-క్రీడాకారులను ప్రోత్సహించి ఆడుదాం ఆంధ్ర ను విజయవంతం చేయండి.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 15 నుండి నిర్వహించనున్న “ఆడుదాం ఆంధ్ర” లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసేందుకు క్రీడాకారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు క్రీడా ప్రాధికారిత సంస్థ అధికారులను ఆదేశించారు.
“ఆడుదాం ఆంధ్ర” క్రీడల నిర్వహణకు ప్రభుత్వం పంపిణి చేసిన స్పోర్ట్స్ కిట్లను గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించి క్రీడా ప్రాధికారిత సంస్థ అధికారులను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను నిర్వహింస్తుందన్నారు. జిల్లాలో నవంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడలలో అధిక సంఖ్యలో పాల్గొనేలా క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. ఐదు క్రీడా అంశాలైనా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో-ఖో విభాగాలలో పోటీలకు సంబంధించి క్రీడా పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో బేసిక్ విభాగానికి సంబంధించి పురుషులకు ఒక కిట్, మహిళలకు ఒక కిట్ ను, ప్రొఫిషనల్ విభాగానికి సంబంధించి పురుషులకు ఒక కిట్, మహిళలకు ఒక కిట్ ను, పంపిణి చేయడం జరిగిందన్నారు. ఇందులో టెన్ని కాయిట్ రింగ్స్, వాలీబాల్స్, నెట్లు, బ్యాట్మెంటన్ నెట్లు, షటిల్ కాక్స్, కబడ్డీ క్రీడాకారులకు నీ కాప్స్, కోకో క్రీడాకారులకు యాంకిల్స్, క్రికెట్ బేసిక్ క్రీడాకారులకు బ్యాట్లు, హార్డ్ టెన్నిస్ బాల్స్, స్టంప్స్, వికెట్ కీపింగ్ గ్లౌజులు ప్రొఫెషనల్ విభాగానికి బ్యాట్లు, బ్యాటింగ్ పాట్స్, బ్యాటింగ్ గ్లౌజూలు , హెల్మెట్, ట్రై ప్యాడ్, చెస్ట్ ప్యాడ్, ఎల్ బో ప్యాడ్ లు, అబ్ డొమినల్ గాడ్స్, వికెట్ కీపింగ్ గ్లౌజులు, ప్యాడ్లు, లెదర్ బాల్స్ ను పంపిణి చేయడం జరిగిందన్నారు. గ్రామ, మండల నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలలో నిర్వహించే క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలను సంబరంగా నిర్వహించి క్రీడ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
క్రీడ పరికరాల పంపిణీ లో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, శాప్ సిఇవో శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ అజీజులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News