Breaking News

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని, వర్క్ అగ్రిమెంట్ పొందిన కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లతో కమిషనర్ స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ గ్రీవెన్స్ లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్నసమస్యలను తమ దృష్టికి తెచ్చారని, వాటి పరిష్కారం నిర్దేశిత గడువులో పరిష్కారం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. కాంట్రాక్టర్లు వర్క్ అగ్రిమెంట్ పొందిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసినప్పుడే నగర అభివృద్ధి జరుగుతుందని, కాంట్రాక్టర్లు తాము పూర్తి చేసిన పనులకు సంబందించి బిల్లుల ఆన్ లైన్ చేయడం, చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యలను ప్రతి శుక్రవారం జరిగే స్పెషల్ గ్రీవెన్స్ లో తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. కాంట్రాక్టర్లు అందించిన ఆర్జీలను, ఫిర్యాదులను ప్రత్యేకంగా నమోదు చేయాలని, వారి సమస్యలు పరిష్కారం అయ్యాక తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలోనే ఆయా స్టేజిల ప్రకారం పనులను ఎంబుక్ ను రికార్డ్ ఎమినిటి కార్యదర్శుల ద్వారా చేయించాలని ఏ.ఈ.లను ఆదేశించామన్నారు. బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం లేకుండా అన్ని స్టేజిల్లో వేగంగా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. కాంట్రాక్టర్లు కూడా తాము చేపట్టే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *