విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ నాయకులకు సేవే పరమావధి కావాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు మర్రి రాజశేఖర్ తెలిపారు. గురువారం అమ్మ కల్యాణ మండపం లో 13వ డివిజన్ సంబందించి ఆరుగురు నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 2,50,000/- విలువ గల నాలుగు టిఫిన్ బండ్లు,రెండు ఇస్త్రీ బండ్లను మర్రి రాజశేఖర్ చేతుల మీదగా ఉచితంగా అందజేశారు.* ఈ సందర్భంలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు దేవినేని అవినాష్ కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ,ఎన్టీఆర్,కృష్ణ,గుంటూరు జిల్లా రీజినల్ కోర్డినెటర్ మర్రి రాజశేఖర్,నగర అధ్యక్షులు బొప్పన బావకుమార్,రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చి బాబు,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,13వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News