Breaking News

డ్రోన్ మరియు రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంతో నేలలో పోషక లభ్యత అంచనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి బుధవారం గోపాల కృష్ణ ద్వివేది. ఐ. ఎ. యస్., స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, (వ్యవసాయ, సహకార శాఖ) మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) వారు డ్రోన్ మరియు రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా నూతన డిజిటల్ పరిజ్ఞానంతో భూసార పరీక్ష మరియు భూసార పటాలను ఆధునీకరించడం పై కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు మరియు శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
• కేంద్రప్రభుత్వ మరియు జాతీయ సంస్థల నుండి
1. డా. ఆయాన్ దాస్, శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, (ఇస్రో), స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్
2. డా. సుజాత మరియు డా. తారిక్, శాస్త్రవేత్తలు, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, (NRSC), హైదరాబాద్
3. డా. యన్. జి. పాటిల్, డైరెక్టర్ మరరియు శాస్త్రవేత్తలు డా. ఓబిరెడ్డి & డా. వాసు, జాతీయ భూసర్వే కేంద్రం, నాగపూర్
4. డా. శర్మ మరియు డా. సురేష్ కుమార్ శాస్త్రవేత్తలు, సర్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ
5. డా. ఎస్. పి. దత్త, డైరెక్టర్ మరియు డా. ఎస్. కె. బెహరా & ఎన్. కె, శర్మ, శాస్త్రవేత్తలు, జాతీయ భూసార పరిశోధన సంస్థ, భోపాల్
• రాష్ట్రప్రభుత్వ సంస్థల నుండి
1. డా. ఆశాజ్యోతి మరియు డా. సాంబయ్య, శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ యూనివర్సిటీ
2. డా. నాగేశ్వరరావు, డా. ప్రసాద్ మరియు డా. సుధీర్ తివారీ డైరెక్టర్ లు , ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు సంబందిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గోపాల కృష్ణ ద్వివేది, ఐ. ఎ. యస్.,  స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, (వ్యవసాయ, సహకార శాఖ) మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు), సమావేశపు ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారి సూచన మేరకు ప్రస్తుత అందుబాటులో ఉన్న డ్రోన్ మరియు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో భూసార పరీక్షల స్థాయిని పెంచవలసిన ఆవశ్యకతను తెలియచేసారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా నేలలోని పోషక లభ్యతను రైతులకు వెంటనే తెలియచేసి తద్వారా వారు ఎరువుల పై పెట్టే ఖర్చును తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవలసిన అవసరాన్ని తెలియచేసారు. ఈ దిశగా సంబందిత జాతీయ సంస్థలలో జరుగుతున్న ఆధునిక పరిశోధన మరియు ప్రయోగాల ఫలితాలను, నూతన సాంకేతిక సలహాలను అందచేయవలసినదిగా కోరారు మరియు వీటిపై సంబందిత శాస్త్రవేత్తలతో నూతన ఆవిష్కరణల పై చర్చించారు.
సి. హరికిరణ్, ఐ.ఎ.యస్., ప్రత్యేక వ్యవసాయ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 40 లక్షల పైబడి భూసార పరీక్షలు నిర్వహించి విశ్లేషణ పత్రాలను రైతులకి అందచేశామని తెలియచేసారు. పంటల ఎదుగుదలకు దోహదపడే ఉదజని సూచిక, లవణ సూచిక,సేంద్రీయ కర్బనం మరియు 9 రకాల పోషకాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా విశ్లేషించి నేలలో వాటి లభ్యతను గుర్తించి తగు విధంగా పోషక విలువ ఆధారిత ఎరువుల సిఫార్సులను రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ రైతులకు తెలియచేస్తున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *