విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రదాతగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుదవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, 87వ సచివాలయం పరిధిలోని అంగన్ వాడి సెంటర్ నందు, 11వ డివిజన్, 41వ సచివాలయం పరిధిలోని కరణం బజార్ నందు, 13వ డివిజన్, 56వ సచివాలయం పరిధిలోని వి.ఎమ్.సి స్కూల్ నంద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ప్రారంభించి అందులో నిర్వహించే వైద్య పరీక్షలు గురుంచి వైద్యారోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చూడాలన్నదే సీఎం జగనన్న సంకల్పమన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కార్పోరేట్ వైద్యంఅందుతోందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందులు ఎంత ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అక్కడి రోగులతో మాట్లాడుతూ వారి ఆరోగ్యపరిస్థితిగురించిఆరాతీశారు.హిమోగ్లోబిన్, బీపీ, మధుమేహం తదితర దీర్ఘకాల వ్యాధులను ఇక్కడ పరీక్షించి తగు వైద్యం, ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన మేరకు ఆరోగ్య శ్రీ నెటీవర్క్ హాస్పిటల్ కు రెఫెర్ చేసి మెరుగైన వైద్యం, ఆపేరేషన్ లు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీరు సంపూర్ణ ఆరోగ్యముతో తిరిగి వచ్చేవరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో పెన్షన్లు తీసుకోవాలి అంటే కొండ దిగి కిందకు వచ్చి కార్యాలయాల చుట్టూ తిరిగితే గాని వచ్చేది కాదు అని, ఏదైనా సంక్షేమ పథకాలు కావాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి వారికి ఓట్లు వేస్తాం అంటేనే ఇచ్చేవారు అని విమర్శించారు. కానీ నేడు వలంటీర్ లు నేరుగా మీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో DM&HO సుహాసిని,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,జోనల్ కమిషనర్ కృష , 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్, 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్ కుమార్,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్, డా సెల్ ఉపాధ్యక్షులు మెహబూబ్,మండల ప్రెసిడెంట్లు బుర్రి జగజ్జివన్ రామ్, ఎమ్.డి రిజ్వాన్ మరియు ఆయా డివిజన్ల వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వి.ఎమ్.సి అధికారులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News