Breaking News

మూడో ద‌శ స‌మ‌గ్ర స‌ర్వే ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి.

-జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్‌ కంగా అమ‌లుచేస్తున్న వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు, భూర‌క్ష ప‌థ‌కంలో భాగంగా జిల్లాలో చేప‌ట్టిన స‌మ‌గ్ర భూ స‌ర్వే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. గురువారం క‌లెక్ట‌రేట్ పింగ‌ళి వెంక‌య్య స్పంద‌న స‌మావేశ మందిరంలో జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌.. రెవెన్యూ, స‌ర్వే అధికారుల‌తో స‌మ‌గ్ర భూ స‌ర్వేపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో జ‌రుగుతున్న స‌ర్వే ప‌నుల పురోగ‌తిపై చ‌ర్చించారు. అనంత‌రం జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మూడో ద‌శ కింద 100 గ్రామాల్లో రీస‌ర్వే ప్ర‌క్రియ చేప‌ట్టడం జ‌రిగింద‌ని.. వీటిలో ఇప్ప‌టికే 29 గ్రామాల్లో 13 నోటిఫికేష‌న్ జారీచేయ‌డం జ‌రిగింద‌న్నారు. మిగిలిన గ్రామాల్లో జ‌రుగుతున్న గ్రౌండ్ వ్యాలిడేష‌న్‌, గ్రౌండ్ ట్రూతింగ్ ప్ర‌క్రియ‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి నిర్దేశిత డిసెంబ‌ర్ మాసాంతం గ‌డువులోగా పూర్తిచేయాలని అధికారుల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ ఆదేశించారు. స‌మావేశంలో స‌బ్ క‌లెక్ట‌ర్ అదితి సింగ్‌, డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌రావు, ఆర్‌డీవోలు పి.సాయిబాబా, మాధ‌వి, ఏడీ స‌ర్వే శ్రీనివాస్, రెవెన్యూ, స‌ర్వే అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *