Breaking News

రేపే బెజవాడలో “వసంతం 2023” ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకురాలు కమలాదేవి చటోపాధ్యాయ వారసత్వాన్ని కొనసాగిస్తూ “వసంతం 2023” ని మీ ముందుకు తీసుకొస్తుంది. స్థానిక జ్యోతి కన్వర్షన్ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు సి సి ఏ పి చైర్ పర్సన్ ఎస్‌.రంజన, జాయింట్ సెక్రెటరీ బి.సుజాత మాట్లాడుతూ విజయవాడలో జరిగే నవంబర్ 4, 5 తేదీలలో రెండు రోజుల వార్షిక కార్యక్రమం జరుగుతుందన్నారు.  4వ తేదీ ఆంధ్రప్రదేశ్ బి.జె.పి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భారతదేశంలోని నలు మూలల నుండి కళాకారులు ఇందులో పాల్గొంటారన్నారు.  వీరు నేత కార్మికులు, డిజైనర్లు, హస్త కళాకారులు, గోండు కళాకారులు, తోలు బొమ్మ, ఉదయగిరి, జూటీలు, ఏలూరు తివాచీలు, బంజారా నీడిల్స్ వంటి చేతిపనులు చేసే కళాకారులు ఉన్నారన్నారు. అంతేకాకుండా ఒడిశా, బనారస్, కోట, గద్వాల్, చన్ దేరి, లక్నో, చికెన్ కారి, కాంచీపురం, బీహార్, పశ్చిమ బెంగాల్, వివిధ ప్రాంతాలలోని నేత కార్మికులున్నారన్నారు.  మన ప్రజలలో చేనేత వస్త్రాల పట్ల అవగాహన, మక్కువను బట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పరచామన్నారు. . ఇందులో కొంతమంది నూతన కళాకారులు కూడా పాల్గొంటారు. వ్యక్తులు వివాహ షాపింగ్, పండుగలు, ఇతరులకు ఇచ్చే గిఫ్ట్ లు, మిక్స్ డ్, చీరల కు ఇతర దుస్తుల మ్యాచింగ్ లు అన్ని ఒకే చోట ఉండేలా దీనిని మేము రూపొందించామన్నారు. ఇక్కడ కొన్ని రకాల చీరలు, డ్రస్సులు, క్యాజువల్స్ అన్ని తరగతుల, వయస్సుల వారికి తగినవిగా ఉండటమే కాకుండా స్టైల్, సరసమైన ధరలలో అందుబాటులో ఉంటాయన్నారు.  ఈ స్టాల్ లు మొత్తం 70 ఉండగా ఇందులో క్రొత్త వారు 21 మంది పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం హస్తకళాకారుల కోసం ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అత్యధికంగా విచ్చేసి మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్తువులను, కొనుగోలు చేయవలసిందిగా కోరారు. రాబోవు బావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందించే దిశగా సహకారం అందివ్వాలన్నారు . ఈ కార్యక్రమంలో కొండపల్లి బొమ్మల తయారీలో విశేష ప్రతిభను కనపర్చిన సామల నాగేశ్వర రావు ని అవార్డుతో సత్కరించుకోవడం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి కార్యదర్శి, సభ్యులు జి.రష్మీ, తదితర సభ్యులు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *