-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వచ్చిన 30 ఫిర్యాదులకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం ఉదయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగానికి 5, టౌన్ ప్లానింగ్ విభాగానికి 15, రెవెన్యూ విధిభాగానికి ఒకటి, హెల్త్ విభాగానికి ఒకటి , PO-UCD విభాగానికి 6 , ఎలక్షన్ విభాగానికి ఒకటి, AC PROJECT విభాగానికి ఒకటి మొత్తం కలిపి 30 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి అందుకున్న ఈ ఫిర్యాదులకు సత్వర పరిష్కారాలు ఇవ్వాలని సంబంధిత విభాగం అధికారులకు కమిషనర్ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) రోహిణి, జాయింట్ డైరెక్టర్ అమృత్ కే. లతా, సిటీ ప్లానర్ జుబిన్ సిరన్ రాయ్, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, ఏ డి హెచ్ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు
Prajavartha Online Telugu News