Breaking News

జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడల్లో మరింతగా రాణించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లోని స్పందన మీటింగ్ హాల్లో నాగాయలంకకు చెందిన ఇరువురు క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు.

నాగాయలంకకు చెందిన నాగిడి సాంబశివరావు కుమార్తెలు గాయత్రి, భార్గవి కియా కింగ్, కెనోయింగ్ క్రీడారంగంలో ఇటీవల బాగా రాణించి జాతీయస్థాయిలో పతకాలు పొందారు. ఈ ఏడాది అక్టోబర్ 17, 18 తేదీలలో మధ్యప్రదేశ్ లో జరిగిన కియాకింగ్ పోటీలలో నాగిడి గాయత్రి రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాన్ని సాధించింది. అలాగే ఆమె సోదరి నాగిడి భార్గవి కెనోయింగ్ లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. అనంతరం జరిగిన 37వ జాతీయ క్రీడల్లో నాగిడి గాయత్రి రెండవ స్థానంలో నిలిచి వెండి పథకాన్ని సాధించింది. అదే క్రీడల్లో నాగిడి భార్గవి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వారు ఇరువురిని జిల్లా చీఫ్ కోచ్ ఝాన్సీ జిల్లా కలెక్టర్ కు పరిచయం చేస్తూ వివరాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందిస్తూ రానున్న క్రీడా పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని కోరారు.

వారితోపాటు జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ఆర్ డి ఓ ఎం వాణి డిఆర్ఓ పెద్ది రోజా, ఆర్డీవో ఎం వాణి జిల్లా అధికారులు అందరూ కూడా క్రీడాకారులను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *