Breaking News

వినియోగ‌దారుల హ‌క్కుల వినూత్న అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల నివేదిక‌ల‌ను డిసెంబ‌ర్ 8లోగా పంపాలి

-ఉత్త‌మ‌మైన వాటికి రాష్ట్ర‌స్థాయి జాతీయ వినియోగ‌దారుల దినోత్స‌వం వేడుక‌ల్లో స‌త్కారం
-జాయింట్ కలెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగ‌దారుల హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, ప‌రిర‌క్షించేందుకు ఏటా డిసెంబ‌ర్ 24న జాతీయ వినియోగ‌దారుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామ‌ని.. ఈ నేప‌థ్యంలో జిల్లాలోని వినియోగ‌దారుల స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వినియోగ‌దారుల క్ల‌బ్‌లు వినియోగ‌దారుల హ‌క్కులపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 8వ తేదీలోగా జాయింట్ క‌లెక్ట‌ర్‌కు అంద‌జేయాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ తెలిపారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వీడియో, ఫొటోల‌తో పాటు స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిన ఎడ‌ల వాటిలో ఉత్త‌మ‌మైన మూడింటిని ఎంపిక చేసి జాతీయ వినియోగ‌దారుల దినోత్స‌వం రాష్ట్ర‌స్థాయి వేడుక‌ల్లో స‌త్క‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వినియోగ‌దారుల ర‌క్ష‌ణ చ‌ట్టం-2019పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి రూపొందించిన వినూత్న కార్యాచ‌ర‌ణ ద్వారా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. షార్ట్‌ఫిల్మ్‌, ర్యాలీ, స్కిట్‌లు, ఇంటింటి ప్ర‌చారం, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఎక్స్‌పో వంటివి నిర్వ‌హించ‌వ‌చ్చ‌న్నారు. వినియోగ‌దారుల‌ స్వ‌చ్ఛంద సంస్థ‌లు సొంతంగా లేదా వినియోగదారుల క్ల‌బ్‌ల విద్యార్థుల‌తో కార్య‌క్ర‌మాలు నిర్‌ంహించ‌వ‌చ్చ‌ని.. అయితే ఎంఈవో, స్కూల్ హెడ్‌మాస్ట‌ర్ నుంచి అనుమ‌తి పొందాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *