విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘కండోర్ గ్రూప్ రిటైల్ మీట్ 2023’ శుక్రవారం స్థానిక గాంధీనగర్ ప్రముఖ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.పీ ఏరియా మేనేజర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… మా గ్రూపులో ఏరోకిడ్స్, ఇన్ బ్లూ, ఏరోవాక్, బ్రాండ్స్ చాలా నాణ్యత గల ప్రొడక్ట్స్ అని గత 27 సంవత్సరాలుగా మేము భారతదేశం అంతటా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సప్లై చేస్తున్నామని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలలో డిస్ట్రిబ్యూటర్ల కు సప్లై చేస్తున్నామని తెలిపారు. అన్ని చోట్ల మా కస్టమర్లు, మా యొక్క ప్రోడక్ట్ కొనుగోలు చేసి, డిస్ట్రిబ్యూటర్స్ కి వ్యాపార అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్నారని అన్నారు. మేము ఈ ఆధునిక ప్రపంచంలో కస్టమర్లకు, కావలసిన రీతిలో కొత్తమోడల్స్ ఎప్పటికప్పుడు నాణ్యతగా గ్యారెంటీ, వారంటీతో, వాటర్ ప్రూఫ్, ఆఫీస్, రెగ్యులర్, కిడ్స్ కి కొత్త మోడల్స్ తయారుచేసి మార్కెట్లో మా బ్రాండ్స్ కి ప్రత్యేకత తెచ్చుకున్నామని ఆయన అన్నారు. బాల, బాలికలకు, (కిడ్స్) పాదాలు చాలా సున్నితంగా ఉంటాయని, వాటికి తగినట్టే చాలా కంఫర్టబుల్ గా మేము చెప్పులు, తయారు చేస్తున్నామని అన్నారు. కండోర్ గ్రూప్ భారతదేశమంతట, ఏరో కిడ్స్, ఇన్ బ్లూ, ఏరోవాక్ బ్రాండ్స్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రాంచీజ్, డిస్ట్రిబ్యూటర్స్, కావలసినవారు, మా ఫోన్ నెంబర్ : 810662 7774 కి ఫోన్ చేయగలరు. ఆన్ లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కన్సల్టెంట్ హేమ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News