– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరానాయక్ నగర్ కు ఒక రూపాన్ని ఇచ్చింది సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ మల్లాది విష్ణు అన్నారు. నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో కలిసి కాలనీ ఆర్చ్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా, పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. ఇందిరానాయక్ నగర్ అభివృద్ధికి కనీసం నయా పైసా కూడా వెచ్చించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈప్రాంతానికి కొత్త కళ వచ్చిందని.. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.22 కోట్ల నిధులను డివిజన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలియజేశారు. ఆర్చ్ నిర్మాణానికి ఎమ్మెల్యే అందించిన తోడ్పాటును మరువలేమని ఈ సందర్భంగా కాలనీవాసులు తెలియజేశారు. అనంతరం మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 29 వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మిపతి, కాలనీ సెక్రటరీ రామారావు, ట్రెజరర్ గౌతమ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News