Breaking News

మధుమేహం పట్ల మరింత అప్రమత్తత అవసరం


-విపరీతంగా పెరిగిపోతున్న ప్రీ డయాబెటిస్ కేసులు
-మధుమేహంతో పాటు ప్రాణాంతకంగా మారుతున్న స్థూలకాయం
-ఐఎంఏ, వైడీఆర్ఎఫ్ డయాబ్ ఎండో కాన్ 2023లో వక్తలు
-సదస్సులో పాల్గొన్న జాతీయ స్థాయి వైద్య నిపుణులు, 500 మందికి పైగా వైద్యులు
-డాక్టర్ పి.వి. రావుకు గోల్డ్ మెడల్ ప్రదానం
-ఆధునిక చికిత్సలు,నవీన ఔషధాలతో అద్భుత ఫలితాలు
-ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోజురోజుకూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళకర స్థాయిలో పెరుగుతోందని, షుగర్ వ్యాధి పట్ల మరింత అప్రమత్తత అవసరమని యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత డయాబెటాల్జిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు. మధుమేహం, ఎండోక్రైనాలజీ విభాగాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ లక్ష్యంతో, ఐఎంఏ, వైడీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2023 సదస్సును నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హోటల్లో ఆదివారం జరిగిన ఈ సదస్సులో 25 మంది జాతీయ స్థాయి వైద్య నిపుణులు, 500 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు. ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు కీలక ఉపన్యాసం చేస్తూ.. “ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజా అంచనాల ప్రకారం, మన దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మంది షుగర్ షుగర్ పేషెంట్లున్నారు. అత్యంత ఆందోళకరమైన విషయం ఏమిటంటే, ప్రీ-డయాబెటిస్ కేసుల సంఖ్య ఆందోళకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో యువతను అప్రమత్తం చేసి, ప్రీ-డయాబెటిస్ స్ధితిలో ఉన్నవారిని డయాబెటిస్ రోగులుగా మారకుండా నిరోధించాల్సివుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అత్యధిక శాతం మంది స్థూలకాయం బారినపడుతున్నారు. మధుమేహానికి, స్థూలకాయం తోడవడం ప్రాణాంతకంగా మారుతోంది. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా, అనేక శారీరక రుగ్మతలను అధిగమించడంతో పాటు, షుగర్ వ్యాధిని సైతం తిప్పికొట్టవచ్చు. మధుమేహ వ్యాధికి ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సా విధానాలు, నవీన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి పట్ల అవగాహన కలిగివుండి, తగు జాగ్రత్తలు పాటిస్తే.. మధుమేహం బారినపడకుండా చూసుకోవచ్చు. సదస్సులో ప్రధానంగా, ప్రీ-డయాబెటిస్ గురించి విశ్లేషించాం. గర్భిణీలకు చికిత్సల గురించి గైనకాలజిస్టుల కోసం ప్రత్యేక సెషన్ నిర్వహించాం. మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, అత్యాధునిక వైద్య చికిత్సలు ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలా చేసేందుకు ఈ సదస్సు దోహదపడుతుంది” అని తెలిపారు. సదస్సులో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పి.వి.రావుకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సదస్సులో ఐఎంఏ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ చలసాని ప్రమోద్, సెక్రటరీ డాక్టర్ అక్కినేని శివరామ్, వైడీఆర్ఎఫ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి హిమన, సెక్రటరీ డాక్టర్ వై. ఐశ్వర్య, జాయింట్ సెక్రటరీ డాక్టర్ వై. అమూల్య పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *