విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు బుక్ ఫెస్టివల్ సొసైటీ గౌరవాధ్యక్షులు బి.బాజ్జీ తెలిపారు. నగరంలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతుందని అన్నారు. ప్రతి సారి జనవరి 1న పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని కానీ ఈసారి మూడు రోజులు ముందుగా ఈ నెల 28 నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణానికి కీర్తిశేషులు వరహాలు చెట్టి ప్రాంగణంగా పేరు పెట్టినట్లు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభిస్తారని అని తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం శత జయంతి సభలు, పుస్తకావిష్కరణ జరుగుతాయని తెలిపారు. ప్రతిభ వేదికపై విద్యార్థులకు వివిధ పోటీలు జరుగుతాయని తెలిపారు. జనవరి 1వ తేదీన పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని అన్నారు. పాదయాత్ర సిద్ధార్థ కళాశాల నుండి పుస్తక మహోత్సవం ప్రాంగణం వరకు జరుగుతుందని అన్నారు. జనవరి 7 వ తేదీన ముగింపు సభ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్ పాల్గొంటారని తెలిపారు . విలేకరుల సమావేశంలో బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు, కార్యదర్శి కె. లక్ష్మయ్య, గోళ్ళ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News