విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉన్న దేవాలయాల స్థితిగతులు, వాటి చరిత్రతో ఆటు గుడికి సంబంధించిన బంగారం, ధనం, భూమి వంటి విషయాలను అధ్యాయనం చేయటానికి వంద గుడుల బండారం భక్త చైతన్య యాత్ర (ధనం, బంగారం, భూమి)ను చేట్టామని సినీ గేయ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తెలిపారు. శనివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలోని సుమారుగా ముఖ్యమైన 100 దేవాలయాలు ఈ నెల 6 నుండి సందర్శిస్తున్నామన్నారు. దానిలో భాగంగానే కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం, ఆంధ్ర మహావిష్ణు క్షేత్రం మోపిదేవి, నడకుదురు, కల్లేపల్లి, ఘంటసాల, ఐలూరు, యనమలకుదురు, దేవాలయాలను సందర్శించామని ఇవి స్కంధపురాణాలలో ఉన్నాయని ప్రస్తుతం వాటి దుస్థితి చూసి చాలా భాదగా ఉందన్నారు. అర్చకులు గుళ్లలో పనిచేసే సిబ్బంది గురించి ఈ దేవాలయల కోసం స్థితి గతుల కోసం అధ్యయనం చేస్తున్నామని, గుడికి సంబంధించి ఎంత బంగారం, ధనం, ఎన్ని ఎకరాలు భూమి ఉందని, తెలుసుకొని ప్రజలకు, ప్రభుత్వనికి తెలుపుతామని అన్నారు. దీని వలన అద్భుతమైన మార్పు కలుగుతుంది అని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలుగు భాషాభివృద్ధి జరగాలన్నారు. అలాగే చలనచిత్ర పరిశ్రమ కూడా ఏపీకి రావాలని, మద్రాసు నుండి ఏపీకి చలనచిత్ర పరిశ్రమ వచ్చిందని, అప్పుడు ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఏపీ చెందిన వారు నిర్మాతలు గాను, దర్శకులుగాను, కథ రచితంగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. దాంతో చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలివచ్చారన్నారు. ప్రధాన చానల్స్ లో తెలంగాణ యాంకర్స్ ఉంటున్నారని తెలంగాణ యాస లోనే వార్తలు చదువుతున్నారని, మనము ఆ వార్తలు వింటున్నాము. మన రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఉంటే మన రాష్ట్రంలో ఉన్న ఐదు ప్రాంతాలలో ఉన్న యాసలలో సినిమాలు తీయచ్చని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేవని, అభివృద్ధి చెందలేదని అంటున్నారని, ప్రభుత్వమే వాటిన ఆహ్వానించాలని అందుకు సినిమాటోగ్రఫీ మంత్రి చొరవ తీసుకోవాలన్నారు. నందిగామ దగ్గర ఉన్న గరికపాడు లో 100 ఎకరాలతో సినీ స్టూడియో కట్టాలని అప్పుడు రెండు రాష్ట్రాలకి దగ్గరగా ఉంటుందని, ప్రభుత్వ స్థలాల్లో కట్టాలని, రాష్ట్ర ప్రభుత్వమే ఓటిటి ప్లాట్ఫామ్ పెట్టాలని, ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. భూమి ఇస్తే వచ్చేవారు ఉన్నారని, కళా రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఐటీ కంపెనీలు కూడా రావాలని, అప్పుడే రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డా. పిటిజివి రంగాచార్యులు, శ్రీరంగపురం అవధానుల విజయ్ కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News