Breaking News

ఆహ్లాదాన్ని పంచేలా పార్కుల సుందరీకరణ

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అందించేలా నియోజకవర్గంలో పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 63వ డివిజన్ సుందరయ్యనగర్లో రూ. 80 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పరిచిన పార్కును స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా గడిపారు. నగర అభివృద్ధిలో భాగంగా దశల వారీగా పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 95 శాతం పార్కుల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సుందరయ్య పార్కులో చిన్నారులను ఉల్లాస పరిచేందుకు అవసరమైన ఆట వస్తువులతో పాటు విశాలమైన వాకింగ్ ట్రాక్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అలాగే పలుచోట్ల ప్రజల అభ్యర్థనల మేరకు రూ.4.15 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో నిరుపయోగంగా ఉన్న 8 ఖాళీ స్థలాలను పార్కులుగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. స్థానికులు ఉదయం సాయంత్రం వేళల్లో సరదాగా గడపడానికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పార్కులు దోహదపడతాయన్నారు. కనుక కాలనీవాసులందరూ ఒక కమిటీగా ఏర్పడి పార్కును సంరక్షించుకోవలసిందిగా సూచించారు. అనంతరం పార్కులో మొక్కలను నాటారు. కార్యక్రమంలో పార్క్ సూపర్ వైజర్ విక్టర్ బాబు, నాయకులు మోదుగుల గణేష్, అలంపూర్ విజయ్, రామిరెడ్డి, సీహెచ్ రవి, హైమావతి, కాలనీవాసులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *