గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య వైద్య రంగాలతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. ఆడుదాం ఆంద్ర పోటీలను ఈ నెల 26 న గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని లయోలా స్కూల్ లో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న సందర్భంగా శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమీషనర్ కీర్తి చేకూరి మరియు కర్పోరేటర్లతో కలిసి మేయర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 26 న ముఖ్యమంత్రి లయోలా స్కూల్ లో ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఎ రాష్ట్రంలో లేని విధంగా విద్య విద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రీడలలో ప్రతిభావంతులను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వనున్నారన్నారు. ఆడుదాం ఆంధ్రలో భాగంగా గుంటూరు నగరంలోని 206 సచివాలయాల పరిధిలో 40 వేల మందికి పైగా పోటీలలో పాల్గొనే అవకాశం ఉందని, క్రీడా పోటీలకు అనుగుణంగా నగరంలో 19 గ్రౌండ్ లను సిద్దం చేస్తున్నామన్నారు. వార్డు సచివాలయాల వారీగా 15 ఏళ్ల పైబడి క్రీడల పట్ల ఆసక్తి ఉండి, అవకాశం కోసం ఎదురు చూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుందని, వాలీబాల్, కబాడీ, ఖోఖో, క్రికెట్, షటిల్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వార్డుల వారీగా ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు అయ్యి ఆడుదాం ఆంధ్ర విఅజయవంతానికి కృషి చేస్తారన్నారు.
కమీషనర్ మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర పోటీలకు నగరంలో ఇప్పటికే 25 వేలమంది రిజిస్టర్ చేసుకున్నారని మరో 10 వేల మంది చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి సచివాలయం నుండు 5 క్రీడాంశాలలో పురుషులు, మహిళల టీం లు ఉన్నాయని, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుండి మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సచివాలయాల వారీగా కిట్లు, టి షర్ట్స్ వచ్చాయని నగరం నుండి టీం లు రాష్ట్ర స్తాయిలో ప్రతిభ చాటి గుంటూరు కు గుర్తింపును తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం పోటీల బ్రోచర్స్ ను ఆవిష్కరించి కిట్స్ ను పరిశీలించారు.
సదరు సమావేశంలో వై.యస్.ఆర్.సి.పి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా, డిప్యూటి కమీషనర్ వెంకటకృష్ణయ్య, డి.యస్.డి.ఓ వెంకటేశ్వర రావు, కార్పొరేటర్లు, శ్యాప్, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News