Breaking News

రజక సంక్షేమం చేతల్లో చూపిన ముఖ్యమంత్రి జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రజకులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం 19వ డివిజన్ పున్నమ్మతోట వద్ద జరిగిన రజక ఆత్మీయ సమావేశంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని రజక సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థాయి కల్పించామని, అంతేకాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి ధోభీకాన లు అభివృద్ధి చేసి వారి వృత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది అని అన్నారు. నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న రజక సోదరులు అందరూ వెన్నంటే నడిచారని నేడు ఆయన తనయుడిగా మీరంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 19వ డివిజన్ లో ఉన్న ధోభీఘట్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని పెండింగులో ఉన్న ప్రహరీ గోడ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, 22వ డివిజన్ లో ఉన్న ధోభీఘట్ లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు ఇలాగే ఉండాలని మీకు ఏ అవసరం వచ్చిన తాను అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి రహేన నాహీద్, జిల్లా అధ్యక్షులు ఉకోటి శేషగిరి,రజక సంఘం పెద్దలు వంశీ, ఏడుకొండలు, పోనుగుపాటి శ్రీనివాస్,శంకర్, మురళి,గోపాలకృష్ణ, సుబ్బారావు,రమేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *