-కాంట్రాక్ట ఏజెన్సీకి పెనాల్టీ విధించిన కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గం శాసన సభులు మల్లాది విష్ణు తో ఆ పరిధిలో ఉన్న సత్యనారాయణపురం లో అమృత్ వన్ పథకం ద్వారా నిర్మాణం అవుతున్న సంపు పనులు పరిశీలించారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనా నిర్మాణ పనులను మూడు వారాల్లో పూర్తి చేయమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కి ఆదేశాలు ఇచ్చారు.
సంపు పనులు పూర్తి కానప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మురికి నీరు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు గత రెండు నెలల నుండి మోటార్ సహాయంతో ఎప్పటికప్పుడు అంతర్గతంగా శుభ్రపరచడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఐనప్పటికీ సంపు పైభాగం నిర్మాణ పనులు అసంపూర్తి ఉన్నందున, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంపు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయమని అన్నారు.
తదుపరి జివిఆర్ నగర్ లో సంపు నిర్మాణ పనులు గడువు లోపు పూర్తి చేయనందున ఆ సంపు నిర్మాణ పనులు తీసుకున్న కాంట్రాక్ట ఏజెన్సీ పై పెనాల్టీ విధించమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ ఆదేశాలు ఇచ్చారు. నెల రోజుల్లో సంపు నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ అన్నారు. రెండోసారి ఇచ్చిన గడువు లోపు నిర్మాణ పనులు పూర్తి చేయన యెడల మరల అధిక పెనాల్టీ విధిస్తామని కమిషనర్ కాంట్రాక్ట ఏజెన్సీ ను హెచ్చరించారు.
జివిఆర్ నగర్ లో వెడల్పు చేసిన రోడ్ పక్కన, వాంబే కాలనీ మెయిన్ రోడ్డు దగ్గర, రైల్వే కాంపౌండ్ ను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కమిషనర్ ని కోరగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చెయ్యడం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేయ్సం తో చర్యలు తీసుకోమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కు ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, MLA మల్లాది విష్ణు తో పాటు స్థానిక కర్పోరటర్లు మూర్తి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News