Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్యులకు వివాహాది శుభకార్యాలు భారమైన ప్రస్తుత తరుణంలో.. పేద ప్రజల అభిరుచికి తగ్గట్లుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం సంతోషదాయకమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలో రూ. 55.85 లక్షల వ్యయంతో నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. వెట్టి చాకిరి నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ పేరు మీద కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. పేద, సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సకల హంగులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించి ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటిరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం మాట్లాడుతూ.. రజక సామాజికవర్గానికి అన్నివిధాలా అండదండలు అందించడంలోనూ మల్లాది విష్ణు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే ఒక్క మాటతో ప్రైవేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా దుర్గాపురంలో రజక కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. ఆయన చొరవతోనే గాంధీనగర్ లో వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అటువంటి నాయకుడిని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, ఏపీ రజక సంఘం అధ్యక్షులు కందగట్ల శ్రీనివాసరావు, నాయకులు కురిటి శివ, శనగశెట్టి హరిబాబు, పిల్లుట్ల వంశీ, లంకా కుమార్, శీలం భవానీ రెడ్డి, బొప్పన గాంధీ, మండా రాము, కగ్గా పాండు, యర్రంశెట్టి శ్రీనివాస్, బాడిద అప్పారావు, కూనపురెడ్డి అనిల్, వి.బి.ఆచారి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *