Breaking News

శాంతి-అహింస, పర్యావరణాన్ని కాపాడాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో గాంధీదేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌, నవభారత్‌ నిర్మాణ సంఘం, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ డిటైర్‌మెంట్‌ అండ్‌ ఎన్విరాల్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ల ఆధ్వర్యంలో రైటర్స్‌ మీట్‌, కవి సమ్మేళనం జరిగింది. గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నోబుల్‌ పీస్‌ ప్రైజ్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ బాలకృష్ణ కుర్వే మాట్లాడుతూ యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతున్నాయని, అందుకే యుద్ధం కోరే దేశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 30 ఏళ్లుగా ఇండియా మొత్తం తిరిగి శాంతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. దాదాపు అంతర్జాతీయంగా శాంతికాముకులు, కొన్ని శాంతి కోరే దేశాలు, స్వచ్ఛంద సంస్థల 30 సంవత్సరాల కృషి వల్ల నేడు మందుపాతరలు లేకుండా పోయాయని, కానీ సామూహిక బాంబులు నేటికీ కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయన్నారు. వీటిని తక్షణమే నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కవులు, రచయితలు ప్రపంచ శాంతిలో భాగస్వాములు కావాలన్నారు.
నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి-అహింస అనేటువంటి సిద్ధాంతాలను ప్రచారం చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించాలి లేకుంటే భవిష్యత్తు ఉండదనే విషయంలో భాగంగా ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. కవులు శాంతికాముకులు కాబట్టి, కవి సమ్మేళనం ఏర్పాటుచేసి వారికి ఇందులో భాగస్వాములను చేశామని చెప్పారు. ఇందులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు శాంతిని కోరుతూ, పర్యావరణాన్ని కాపాడమంటూ మంచి మంచి కవితలు వినిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌, నవభారత్‌ నిర్మాణ సంఘం చైర్మన్‌ సూరేపల్లి రవికుమార్‌, నవమల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, సాహితీవేత్త వంతుల వెంకటేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్టు డాక్టర్‌ ఘంటా విజయ్‌కుమార్‌, ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె.మధుసూదనరాజు, సింగర్‌ సత్యస్వాతి, 64 కళలు డాట్‌ కామ్‌ ఎడిటర్‌ కళాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *